సాహసం,సమయస్ఫూర్తి ,పరమత సహనం,గెరిల్లా యుద్ధాలకు పెట్టింది పేరు.. "ఛత్రపతి శివాజీ " ■ "మీరు సిపాయి అయినా, సైనికాధికారి అయినా గ్రామస్తులకూ, రైతులకూ భారం కాకూడదు. గడ్డిపోచ కూడా వారి నుంచి గుంజుకోకూడదు. మీ అవసరాలకు రాజ భాండాగారం నుంచి నిధులు పంపిస్తున్నాం. ఎటువంటి అవసరాలున్నా ఆ డబ్బునే వాడండి. ఆహారంతోపాటు కూరగాయలు, వంట సామగ్రి, వంటచెరకు, చివరకు పశుగ్రాసం కూడా డబ్బులు చెల్లించే తీసు కోవాలి. బలవంతంగా లాక్కోగూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే రైతాంగం మనల్నందర్నీ దూషిస్తుంది. అర్థం చేసుకోండి. రైతాంగం, సామాన్య ప్రజలెవ్వరూ కూడా మన వల్ల ఇబ్బందులు పడకూడదు"... మే19,1673న భవానీశంకర్ అనే సైనికాధికారికి ఛత్రపతి శివాజీ మహరాజ్ 'రాసిన లేఖ'లోని అంశాలివి. ■ శివాజీ... ఈ పేరు వినగానే పౌరుషాగ్ని గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీర శివాజీ అనే నినాదం మన చెవుల్లో మార్మోగుతున్నట్టుంటుంది. ఆ యన సాహసం, వీరత్వం, ధీర త్వం,సమయ స్ఫూర్తి, యుద్ధతం త్రం పుస్తకాల నిండా మనకు కనిపించేవే. ఆయన గెరిల్లా యుద్ధ తంత్రం చరిత్రలో మరపు రాని ఘట్టం. ■ వక్రీకరించిన చరిత్రకానీ, ఆయన ప...