Skip to main content

Posts

Showing posts with the label నీతి కథలు

నీతి కథలు - పెద్దల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోకండి !!

పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి! చిన్న‌ సంఘటన. పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  ఆయన  మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు. భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి. తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది. భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు. అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్ల...

నీతి కథలు - 'అన్న దాన మహాత్మ్యం'

అన్నదాన మహాత్మ్యం - ఒక కథ అన్నపూర్ణ ఒక గృహిణి. కొంత ఆవేశం ఎక్కువ. కాని చాలా మంచిది.ఆమె మీద వాళ్ల అమ్మమ్మ ప్రభావం ఎక్కువ. "ప్రతి రోజూ కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి " అని వాళ్ల అమ్మమ్మ చెప్పే మాటలను అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది. అన్నపూర్ణ ప్రతి రోజూ కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది. వాళ్లింటికి ప్రతి రోజూ ఒక  ముసలి మరుగుజ్జు వాడు వచ్చేవాడు. అతని నడుక గాలిలో నడుస్తున్నట్లుగా ఉండేది.మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కాని తరువాత అలవాటైపోయింది ఆమెకు. ఆ రెండు రోట్టెలను అతనికి ఇచ్చేది. అతడు ఆ రొట్టెలను తీసుకుని .. "నీవు చేసిన చెడు నీతోనే ఉండు. మంచి మాత్రం తిరిగి వచ్చు !" అని పాడుకుంటూ వెళ్లి పోయేవాడు. వేగంగా పాడడం వల్ల అదేమి అన్నపూర్ణకు అర్థం అయ్యేది కాదు. ఇలా ప్రతి రోజూ జరిగేది. ఒక రోజు అతను ఏమంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది.ఆమెకు చాలా కోపం వచ్చింది. "ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెబుతున్నాడనుకుంది.కాని, వాడు తిడుతున్నాడు. ఎవరైనా ...

నీతి కథలు - ఆ (హా) కలీ!

                  *ఆ (హా) కలీ!*                            (భిక్షగాడి కథ)       అది ఒక పెద్ద మర్రి చెట్టు. అది భూమాతకు ఎండ వడ తగలకుండా గొడుగు పట్టిందా అన్నట్లు బాగా విస్తరించి ఉంది. దాని మొదలు దగ్గర చిన్న అరుగు. దాని ప్రక్కనే దిగుడు మెట్ల బావి. అది ప్రాచీన నాగరికతకు చిహ్నంలా నిలిచి ఉంది. అది కొండవాలు ప్రాంతంలో ఉన్నందునేమో అందులో నీటివూట ఉంది.       చెట్టు క్రిందనున్న అరుగుపై ఒక మానవ దేహం. చూసేవారికి అది నిర్జీవం అనిపిస్తుంది. కానీ ఈగల మూకలు చేసే అలజడిని భరించలేని శరీరం  అప్పుడప్పుడూ కదులుతూ ఉంది.       సూర్యుడు తన ప్రయాణంలో అలసిపోయి ఒకచోట ఆగిపోయినట్టు ఉన్నాడు. భూగోళంపై మానవులు తమ స్వార్థం కోసం, ఆధిపత్యం కోసం పర్యావరణంపై చేస్తున్న చేష్టలపై తీక్షణ దృష్టిని సారించినట్టున్నాడు.       అత్తమీద కోపం దుత్తమీద పడ్డట్టు ఆ వేడిని భరించలేని పక్షులు చెట్లకొమ్మలను ఆశ్రయిస్తున్నాయి. అవి తమ కూనలతో క...