Skip to main content

Posts

Showing posts with the label News Update

పెట్రోల్, డీసీల్ ... ఇకపై రోజుకో ధర - 16 నుండి దేశవ్యాప్తంగా అమలు !!

పెట్రోల్, డీజిల్... - రోజుకో ధర ⏱ ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా కొత్త విధానం ప్రస్తుతం పక్షానికో సారి మారుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా రోజూ మారనున్నాయి. మే 1 నుండి విశాఖపట్నం, పుదుచ్చేర్రి, చండీగఢ్, ఉదయపూర్, జంషెడ్పూర్ లలో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు దేశంలోని మొత్తం 58 వేల పెట్రోల్ బంకులలో దీని అమలుకు సమయత్తమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణి లో చమురు ధరలు రెండు వారాల సగటు, డాలరుతో రూపాయి మారకపు విలువలో మార్పులకు అనుగుణంగా ప్రతీ నెలా 1,16 తేదీలలో ధరల్ని సవారిస్తున్నారు. ఈ నెల 16 నుండి ఈ రెండు అంశాల ప్రాతిపదికన రోజూ సవరించనున్నారు. ఐఓసీ, హెచ్ పీ సీ ఎల్, బీ పీ సీ ఎల్ సంస్థలు అనుసరించనున్న చలనశీల ( Dynamic) ధరల విధానంతో నగరానికి, నగరానికి, బంకుకూ, బంకుకూ మధ్య కూడా ధరాలలో స్వల్ప వ్యత్యాసం ఉండనుంది.

జాగ్రత్త !! నగదు లావాదేవీలు రూ.2 లక్షలు దాటితే, అంతే మొత్తం పెనాల్టీ - ఐటీ హెచ్చరిక !!

జాగ్రత్త! నగదు లావాదేవీ రూ.2 లక్షలు దాటితే, అంతే మొత్తం పెనాల్టీ, ఐటీ హెచ్చరిక - న్యూఢిల్లీ: భారీ నగదు లావాదేవీలు జరిపే వారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax.gov.in ద్వారా తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు. దీనికి లోక్‌సభ తన ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్‌ 269ఎస్‌టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం. అంతేకాదు, ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం కూడా చట్ట విరుద్ధం. అయితే బ్యాంకులు, పోస్టాఫీసులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆదాయ...

మోదీ రష్యా పర్యటన - భారత్ - రష్యా ల మైత్రికి ఊతం !!

మోదీ రష్యా పర్యటన : భారత్ - రష్యా మైత్రి 'కూడంకుళం’కు గ్రీన్‌సిగ్నల్‌ 5, 6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకారం - ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం - భారత్‌–రష్యా 70 ఏళ్ల బంధం మరింత విస్తృతానికి కార్యాచరణ - ఐదు ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు  - సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: భారత–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా పలు కీలకాంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. *తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది*. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని మోదీ–రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయించారు. మొదట వ్యూహాత్మక చర్చలు జరిపిన మోదీ–పుతిన్‌ ఆ తర్వాత ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘21వ శతాబ్దపు దార్శనికత’ పేరుతో విజన్‌ డాక్యుమెంటును విడుదల ...

పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం - భారత్ పై మరింత భారం మోపిన ట్రంప్ !!

భారత్‌పై మరింత భారం మోపిన ట్రంప్‌ న్యూయార్క్‌: భూతాపోన్నతి ఉద్గారాలను తగ్గించాలనే (క్లైమేట్‌ ఛేంజ్‌) పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ప్రకటించడం భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసే అంశం. దీంతో వేలాది కోట్ల రూపాయల భారం భారత్‌పై పడే ప్రమాదం ఏర్పడింది. అంచనాలకు విరుద్ధంగా జాతీయ వద్ధి రేటు ఈ ఏడాది 7.1 శాతం దాటని పరిస్థితుల్లో ఇది నిజంగా ప్రతికూల పరిణామమే. భారత్‌ లాంటి వర్ధమాన దేశాలు కార్బన ఉద్గారాలను అరికట్టే చర్యలకుగాను అమెరికా లాంటి అభివద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం అందించడం పారిస్‌ ఒప్పందంలో అంతర్భాగం. దీని కోసం గ్రీన్‌ క్లైమెట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అభివద్ధి చెందిన దేశాలు రెండు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల డాలర్ల వరకు నిధులు చెల్లించాలి. పారిస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ ఒప్పందం కుదిరిన 2015 డిసెంబర్‌ నాటి నుంచి ఏడాదికి వంద కోట్ల డాలర్ల చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తానని అమెరికా, ఇంగ్లండ్, చైనా ఇతర అభివద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి. ఈ హామీలో భాగంగా అమెరికా తొలి విడతగా వంద కోట్ల డాలర్లు, అంటే దాదాపు 6,441 కోట్ల రూ...

వినూత్న సదుపాయాలతో టి-వాలెట్ !!

వినూత్న సదుపాయాలతో టి-వాలెట్ !! - లావాదేవీలపై రుసుము లేదు - ఎక్కడి నుంచియైన ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చు. విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటే ఇకపై వరసలో నిల్చోవాల...