Skip to main content

Posts

Showing posts with the label పంచతంత్ర కథలు

పంచతంత్ర కథలు - 'ఎద్దు - సింహం స్నేహం' !!

పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ  ఎద్దు- సింహం స్నేహం ‘‘ప్రభూ’’ పిలిచాడు దమనకుడు.‘‘చెప్పు’’ కళ్ళు తెరిచాడు పింగళకుడు.‘‘ఇందాక తమరు యమునానది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలుచున్నారు. తర్వాత వెను తిరిగి వచ్చారు. వస్తూన్నప్పుడు మిమ్మల్ని చూశాను. అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉన్నారు. ఏంటాలోచిస్తున్నారో సెలవిస్తారా?’’ పింగళకుణ్ణి ముగ్గులోకి దించే ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు.‘‘అదా...అదీ...నీలాంటి వాడికి చెప్పడంలో నామోషీ ఏముందిగాని, ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా. ఏ జంతువుదో పెద్ద కూత. అదే జంతువు అయి ఉంటుందో అంతు చిక్కలేదు. నాకు వినిపించేలా అంతగా కూత పెట్టిందంటే, అదేఁ తక్కువది కాదు. చాలా బలమయినదై ఉండాలి. పైగా ఎంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా’’‘‘మిమ్మల్ని భయపెట్టడమా?’’ మధ్యలోనే మాట అందుకుని ఆశ్చర్యం నటించాడు దమనకుడు.‘‘భయపెట్టడం అంటే భయపెట్టడం కాదు, కాకపోతే నన్ను సవాల్‌ చేస్తున్నట్టుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింప చేసింది.’’ అన్నాడు పింగళకుడు. తర్వాత తల విదిల్చాడు. నిద్రమత్తును పొగొట్టుకున్నాడు. ఇలా అన్నాడు. ‘‘నాకు తెలీయకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు...

పంచతంత్ర కథలు -'ఆషాడభూతి కథ' !!

పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ  ఆషాడభూతి కథ పింగళకుడు, సంజీవకుడు స్నేహితులయిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. కలిసి తింటున్నారు. కలిసి కబుర్లాడుకుంటున్నారు. వారి మధ్యకు ఇంకొకరు చొరుకునే అవకాశమే లేకుండా పోయింది.దమనకుణ్ణి ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. దానిని భరించలేకపోయాడు దమనకుడు. కరటకుణ్ణి కలిశాడు. దమనకుణ్ణి చూస్తూనే కరటకుడు అంతా గ్రహించాడు. ఇలా అన్నాడతనితో.‘‘చూశావా, నువ్వు ఒకటి అనుకున్నావు. ఇంకొకటి అయింది. అదే నేను చెప్పింది. రాజుల తీరే వేరు. వారు ఎవరిని చేరదీస్తారో, ఎందుకు చేరదీస్తారో ఎవరికీ అంతుచిక్కదు. చెబితే విన్నావు కాదు. పైగా ఆ సంజీవకుణ్ణి తీసుకుని వెళ్ళి పింగళకునికి స్నేహితుణ్ణి చేశావు. ఏమయిందిప్పుడు? అక్కడ నీకే చోటు లేకుండా పోయింది.’’‘‘అవును. తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను.’’ అన్నాడు దమనకుడు.‘‘ఒప్పుకోక తప్పుతుందా?’’‘‘ఇదిగో! ఈ మాటలే వద్దు. బాధపడుతున్న వాణ్ణి మరింత బాధపెట్టకు. అయినా నిన్నని ఏం లాభం? దేవుడి దయ లేకపోతే ఏ పనీ జరగదు. నమ్మి మోసపోవడం రాసి పెట్టి ఉంది. జరిగింది. ఆషాఢభూతి కథ గుర్తొస్తోంది.’’‘‘ఏంటా కథ?’’చెప్పసాగాడు దమ...

పంచతంత్ర కథలు - 'కాకి - పాము కథ' !!

పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ  కాకి- పాము కథ ‘‘ఎందుకో కాకి-పాము కథ గుర్తుకొస్తోంది.’’‘‘ఏంటా కథ? చెప్పవూ’’ అడిగాడు కరటకుడు. దమనకుడు చెప్పసాగాడిలా.‘‘పూర్వం యమునానదీతీరంలో ఓ పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఓ మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది. చెట్టు మొదట్లో ఓ పాముపుట్ట ఉండేది. అందులో ఓ పాము ఉండేది. చెట్టు మీద కాకులు లేనప్పుడు, ఈ పాముంది చూశావూ, ఇది చెట్టెక్కి కాకిగూటిలోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది. తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకు తెలుసు. అయినా ఏమీ చేయలేక బాధపడుతూ ఉండేవి. ఒకనాడు ఆ కాకుల జంట, తమకు బాగా పరిచయం ఉన్న నక్క దగ్గరకు వెళ్ళాయి. బాధను వెళ్ళబోసుకున్నాయి. పాము పీడ వదలిపోవాలి. ఉపాయాన్ని చెప్పమని వేడుకున్నాయి. కాకుల బాధనంతా విని వినీ సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క. తర్వాత ఓ కథ చెప్పసాగిందిలా.‘పూర్వం బదరికావనంలో ఓ కొంగ ఉండేది. ముసలి కొంగ అది. ముసలితనం వల్ల ఓపిక లేదు దానికి. దాంతో ఆహారం సంపాదించుకోవడం కష్టమయింది. ఆ కష్టంలో ఓ మాయోపాయాన్ని ఆలోచించి, రోజూ చెరువులో నిల్చొని కళ్ళు మూసుకుని ఉండేదది. తపస్సు చేస్తున్నట్టు నటించేది. ఇదంతా ఓ ...

పంచతంత్ర కథలు - 'కుందేలు - సింహం కథ' !!

పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ  కుందేలు- సింహం కథ మృగరాజు పింగళకుడు, సంజీవకుడు మిత్రులు కావడం దమనకుడు తట్టుకోలేకపోతున్నాడు. సంజీవకుడే పింగళకుడి లోకం అయి పోవడం భరించలేకపోతున్నాడు. తనని రాజు పట్టించుకోకపోవడాన్ని, కనీసం పన్నెత్తి పలకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు. పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలి. వారిద్దరి మధ్యా మిత్రభేదం సృష్టించాలి. స్నేహితుల్ని శత్రువుల్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏం చేస్తే వాళ్ళిద్దరూ శత్రువులవుతారు? దీని మీదే సాటి మంత్రి కరటకునితో చర్చించసాగాడు దమనకుడు. శత్రువుని ఎదుర్కోవడంలో శారీరక బలం కరవయినప్పుడు, బుద్ధిబలాన్ని ఉపయోగించి ఎదుర్కోగలగాలనుకున్నారిద్దరూ. అందుకు సంబంధించి ఓ కథ చెప్పుకున్నారు. మరో కథ కూడా చెబుతానన్నాడు దమనకుడు.‘‘చెప్పు చెప్పు’’ అడిగాడు కరటకుడు.‘‘తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్నే చంపేసిన కథ ఇది. బుద్ధిబలానికి సంబంధించే ఇది కూడా. చెబుతాను, విను.’’ అన్నాడు దమనకుడు. చెప్పసాగాడిలా.‘‘ఇలాగే ఒకానొక అడవి. ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. చాలా బలమైన సింహం అది. పైగా ఆ అడవికి అది రాజు. క్రూరత్వం కూడా బాగా హెచ్చు. దాంత...

పంచతంత్ర కథలు - ' కాకి కుట్ర' !!

పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ  కాకి కుట్ర  నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు. దగ్గరకు చేరదీయకూడదు. చేరదీస్తే కష్టాలు తప్పవు. అన్నాడు కరటకుడు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే! శిక్షించకపోతే మనకే ప్రమాదం. అని సలహా కూడా ఇచ్చాడు పింగళకుడికి. జవాబు కోసం చూడసాగాడు. దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం వళ్ళంతా చెవులు చేసుకున్నాడు.‘‘సంజీవకుడు నా మంత్రి. మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా?’’ అడిగాడు పింగళకుడు. జవాబు ఆశిస్తే, రాజు దగ్గర నుంచి ప్రశ్న వచ్చిపడింది. సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడూ, దమనకుడూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.‘‘ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు. జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినయినా శిక్షించడం తగదు. శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప, వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు గౌరవం పోతుంది. తర్వాత నాశనం అయిపోతాం.’’ అన్నాడు పింగళకుడు. నిజమే! రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక, దమనకులు.‘‘అందుకని ఓ పని చేద్దాం. సంజీవకుని దగ్గరకి ద...

పంచతంత్ర కథలు - కుక్క- గాడిద కథ

పంచతంత్ర  కథలు ---- జగన్నాథ శర్మ  కుక్క- గాడిద కథ అనగనగా ఓ రజకుడు. అతని పేరు ధావకమల్లుడు. కాశీనగరంలో ఉంటున్నాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరచి నిద్రపోయాడు. అర్థరాత్రి అయింది. అదే అదనుగా ఓ దొంగ అతని ఇంటిలోకి చొరబడ్డాడు. దొంగ ఇంటిలోకి చొరబడడాన్ని ధావకమల్లుడి గాడిద, కుక్క చూశాయి. కట్టి ఉండడం వల్ల గాడిద, దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టి లేదు. అది ప్రయత్నించవచ్చు. అయితే అది ఆ ధ్యాసలోనే ఉన్నట్టు లేదు. ఆ విషయాన్నే కుక్కను అడిగింది గాడిద.్చ‘‘ఏంటలా చూస్తూ కూర్చున్నావు. దొంగని చూశావు కదా! మొరుగు. యజమానిని లేపు.’’‘‘నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం నాకు చెప్పక్కర్లే.’’ అంది కుక ్క.‘‘అయ్యయ్యో! ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే’’‘‘దోచుకుపోనీ.’’‘ ‘యజమాని నష్టపోతాడే.’’‘‘నష్టపోనీ.’’ అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది.‘‘రోజు రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంత అన్నం పెడతారెవరయినా. మన యజమానీ ఉన్నాడు. దండం పెట్టడు సరికదా, ఇంత అన్నం కూడా పెట్ట...