Skip to main content

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 6


చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 6*

*సంఘటనలు*
1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.

1909: భౌగోళిక ఉత్తర ధృవాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 6 ఏప్రిల్ 1930 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది

*జననాలు*
1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (మ.1836)

1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)

1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత.

1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త.

1931: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), ప్రముఖ కథా రచయిత.
1956: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

*మరణాలు*
1989: పన్నాలాల్ పటేల్ ప్రముఖ గుజరాతీ భాషా రచయిత.

2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు

2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)



Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...