Skip to main content

చరిత్రలో ఈ రోజు/జూన్ 18

⏱చరిత్రలో ఈ రోజు/జూన్ 18*⏱

*💥సంఘటనలు*💥

*🌸618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం ఛైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు.ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి చక్రవర్తి .*

*🌸1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టెబెల్జియం లోని వాటర్లూలో ఛేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు).*

*🌸1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.*
*🌸1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.*

*🌸1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.*

*🌸1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీలను మొట్ట మొదటి సారి గా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.*

*🌸1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జెర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జెర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన్ జెనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.*

*🌸1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.*

*🌸1977: ఎస్.ఎల్. షక్ దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)*
*🌸1981: ఎయిడ్స్ రోగాన్నికాలిఫోర్నియా లోని సాన్ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.*

*🌸1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)*
*🌸1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వేపై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరఫున తొలి శతకాన్ని నమోదుచేశాడు.*

*🌸1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు 'సాల్లీ రైడ్' (ఎస్.టి.ఎస్-7)*

*🌸2001: భారత ప్రభుత్వం నాగాలేండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.*

*🌸2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.*

*❤జననాలు*❤

*1868 : ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ జననం (మ.1936).*

*🌸1955: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)*

*🌸1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)*

*🍃మరణాలు🍃*

*🌸1929: వేదము వేంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. (జ.1853)*

*🌸1936: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత*

*🌸1953: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (జ.1902)*

*🌸1986: ఖండవల్లి లక్ష్మీరంజనం, సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908)*

*🇮🇳జాతీయ దినాలు*🇮🇳

*🌸ఆటిస్టిక్ ప్రైడ్ డేహిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.*

*🌸గోవా స్వాతంత్య్ర దినోత్సవం.*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...