Skip to main content

రాష్ట్రపతి అభ్యర్థి - ద్రౌపది ముర్ము !!


ద్రౌపది ముర్ము
-----------
మన కొత్త రాష్ట్రపతి గా రాబోతున్న మొదటి ఆదివాసీ మహిళా మణి.
ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ చే ఎంచబడి ,  ప్రణబ్ ముఖర్జీ తరువాత మన రాష్ట్రపతి గా రాబోతున్న మహిళ.
L K అద్వానీ, మురళీ మనోహర్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు చక్కర్లు కొట్టినా, సీనియర్ నాయకులు తో అనేక సార్లు చర్చలు జరిపినా మోడీ తన మార్కు రాజకీయంతో ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తీసుకు వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.
ఎవరీ ద్రౌపది ముర్ము  ?
ప్రస్తుతం మేడమ్ ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉంటున్న రాజకీయ నిపుణురాలు. భారతదేశ  మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి గా రాబోతున్న  మహిళ. తండ్రి  "బిరంచి నారాయణ తుడు". ఒరిస్సా లో పుట్టి పెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
Best MLA అవార్డు :
2007 వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ము కి best MLA అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె 'నీలకంఠ' అవార్డు గ్రహీత కూడా. 1997 లో మొట్టమొదటి సారిగా కౌన్సిలర్ గా ఎన్నికైనా, తర్వాత రాయ్ రణపూర్ NAC కి వైస్ చైర్మన్ అయ్యారు. తరువాత రాయ్ రణపూర్,  ఒరిస్సా నియోజకవర్గాలనుండి MLA గా ఎన్నికైన గానీ, తరువాత రాష్ట్ర మంత్రి గా కూడా పనిచేసారు. 2002 -2009 మధ్య కాలంలో BJP  నేషనల్ Excutive member ST మోర్చా కి సభ్యులు గా ఉన్నారు.
ప్రణబ్ ముఖర్జీ తరువాత :
25th July 2017 తో ముగియనున్న ప్రణబ్ ముఖర్జీ term తరువాత ద్రౌపది ముర్ము ఆ పదవిని చేపట్టబోతున్నారు. ఇదేగాని జరిగితే ఈమె మొట్టమొదటి ఆదివాసీ మహిళా భారత  రాష్ట్రపతి గా చరిత్ర కెక్కనున్నారు. ప్రతి పక్షాలు కూడా ఈమె సభ్యత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితులు లేవని అభిజ్ఞాన వర్గాల భోగట్టా.

Comments