Skip to main content

చరిత్రలో ఈరోజు / ఆగష్టు 3

చరిత్రలో ఈరోజు / ఆగష్టు 3

సంఘటనలు

1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు.

1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు. 

1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.

1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది

1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలయా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.

1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్. అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి

1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్లో ప్రారంబింది.

1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 

1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.

2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.

2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 భక్తులు మృతి చెందారు.

*🌻🌻జననాలు*🌻🌻

1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథానికి రచయిత.

1886: మైథిలీ శరణ్ గుప్త, ప్రముఖ హిందీ రచయిత.

1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)

1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)

1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త.

1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.

1956: టి. మీనాకుమారి, ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.

*🌹🌹మరణాలు*🌹🌹

2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి మరియు రంగస్థల నటి.

2011: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (జ.1942)

2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)

2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)

*♦జాతీయ అంతర్జాతీయ దినాలు*♦

🔻1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు) .

🔻1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...