Skip to main content

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత 

ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు.
మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత.
ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం
ఉత్తరం - జమ్ము
దక్షిణం- నర్మదా సంగమ ప్రాంతం
తూర్పు - ఉత్తరప్రదేశలోని మీరట్‌ 
పశ్చిమం - బెలూచిస్థానలోని మక్రాన తీరంహరప్పా సంస్కృతి - లక్షణాలు: హరప్పా సంస్కృతి, నాగరికతలో నగర నిర్మాణ కౌశలాన్ని విశిష్టమైన అంశంగా చెప్పుకోవచ్చు. 
నగర నిర్మాణం - పట్టణ ప్రణాళిక
సింధు నాగరికత ప్రధాన లక్షణం పట్టణ నాగరికత. ఈ నాగరికత ప్రాంతంలోని భవనాలను ప్రధానంగా కోటలు, పెద్ద భవనాలు, పౌర నిర్మాణాలు, నివాస గృహాలుగా విభజించారు.
కోట:- మొహంజొదారో, హరప్పా నగరాల్లో రెండు ప్రధాన భాగాలు కన్పిస్తాయి. పడమర దిక్కున ఎత్తు ప్రాంతంలో కోట లేదా దుర్గం ఉంటుంది. దీనిలో బహుశా పాలక వర్గం నివాసం ఉండి ఉండవచ్చు. తూర్పు పల్లపు ప్రాంతంలో పౌర నివాస భాగం ఉండేది. పల్లపు ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకం నివసించేవారు. ఇక్కడ దుర్గాలు అష్టముఖ దుర్గాలు(ఆక్టోగనల్‌). మట్టి, మట్టి ఇటుకలతో 6-12 మీటర్ల ఎత్తున్న నేలమీద ఈ దుర్గాలను నిర్మించారు. కోట గోడలను హరప్పాలో దాదాపు 14 మీటర్లు, మొహంజొదారోలో దక్షిణాన 8 మీ., ఉత్తరాన 12.4 మీ. ఉండేలా నిర్మించారు. కోటలోనే ఎత్తైన వేదిక మీద ప్రభుత్వ భవనాలు, మతసం బంధమైన నిర్మాణాలు, ఇతర ముఖ్య కట్టడాలను నిర్మించారు.
భవనాలు:- భవనాలను నివాస గృహాలు, పౌర నిర్మాణాలుగా నిర్మించారు. భవన నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను ఒకే పరిమాణంలో వాడేవారు. పౌర నగరాన్ని చదరంగ పటంలా అడ్డు, నిలువు ఊచలతో ఉన్న చట్రంలా నిర్మించేవారు. ఇలాంటి నిర్మాణాన్ని ‘గ్రిడ్‌ సిస్టమ్‌’ అంటారు.
మొహంజొదారోలో ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా, చిన్న వీధులు తూర్పు, పడమరలుగా ఉన్నాయి. ఇవి పరస్పరం లంబకోణంలో ఖండిస్తునట్లుగా, నగరాన్ని దీర్ఘచతురస్రా కారపు బ్లాకులుగా విభజిస్తున్నాయి. తూర్పు వీధి మిగిలిన వీధుల కన్నా విశాలంగా ఉంది.
తూర్పు వీధి, దక్షిణ వీధి కలిసే కూడలి లండన నగరంలోని ఆక్స్‌ఫర్డ్‌ సర్కస్‌ను పోలి ఆకర్షణీయంగా ఉన్నందున దీనిని ‘ఆక్స్‌ఫర్డ్‌ సర్కస్‌’ అని పిలిచారు.
నివాస గృహాలు:- సాధారణంగా వీధులకు రెండువైపులా నివాస గృహాలు ఉన్నాయి. ధనవంతుల నివాసాలు ఐదారు గదులతో విశాలంగా, సామాన్యుల ఇళ్లు చిన్నవిగా ఉన్నాయి. ఇళ్లన్నింటినీ ఒక క్రమపద్ధతిలో నిర్మించారు.
ఇళ్లను కాల్చిన ఇటుకలతో కట్టేవారు. గోడలు మందంగా ఉండేవి. మొహంజొదారోలో దాదాపు ప్రతి ఇంటికీ ఒక బావి ఉంది. హరప్పాలో కూలీల ఇళ్ల వరసలు బయల్పడ్డాయి. వీటిలో ప్రతి ఇంటిలో రెండు గదులు ఉన్నాయి. అయితే కూలీల ఇళ్లన్నింటికీ కలిపి ఒకే బావి ఉండేది.
ప్రతి ఇంటిలో స్నానపు గదులు, మరుగుదొడ్లు, మురుగునీరు వెళ్లేందుకు కాలువలు, గొట్టాలు అమర్చుకున్నారు. ప్రతి ఇంటి వెలుపల చెత్త కుండీ ఏర్పాటు చేసుకున్నారు. హరప్పా నాగరికతలో పట్టణవాసులు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చారు.
మురుగునీటి కాలువలు:- ప్రతి వీధికి మధ్య, భూగర్భంలో ఇటుకలతో కట్టిన మురుగునీటి కాలువలు ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి మురుగునీరు మట్టి గొట్టాల ద్వారా ఈ కాలువల్లోకి ప్రవహించేవి. ఈ కాలువలను శుభ్రం చేయడానికి అక్కడక్కడ మనిషి దూరే రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఈ కాలువలన్నీ నగరపు వెలుపల నదిలో కలిసేవి. ఇటువంటి విశిష్టమైన మురుగునీటి కాలువల ఏర్పాటు మరే ప్రాచీన నగరంలో కన్పించలేదని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం.
పౌర నిర్మాణాలు: సింధు ప్రజల నిర్మాణ కౌశలం పౌర నిర్మాణాల్లో కనిపిస్తుంది. సామాన్యంగా ప్రభుత్వ భవనాలు, మత సంబంధ నిర్మాణాలు, ఇతర ముఖ్య కట్టడాలు కోటలోనే నిర్మించారు.
మహాస్నాన వాటిక: మొహంజొదారోలో బయల్పడిన నిర్మాణాల్లో పెద్ద నిర్మాణం ‘మహాస్నాన వాటిక’. ఇది కోట లోపల ఉంది. ఇది అందమైన ఇటుక కట్టడానికి నిదర్శనం. స్నానవాటిక పొడవు 11.88 మీటర్లు. వెడల్పు 7.01 మీటర్లు. లోతు 2.4 మీటర్లు. ఈ స్నానవాటికకు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో మెట్ల మార్గం ఉంది. కొలను అడుగు భాగాన్ని ఏటవాలుగా నిర్మించారు. కొలను గోడల నుంచి నీరు ఊరకుండా శిలాజిత్తును వాడారు. కొలను పైభాగంలో చుట్టు ఎడమవైపు తప్ప, మూడు వైపులా రెండు అంతస్థుల వసారా ఉంది. తూర్పు గదిలోని బావి నుంచి కొలనులోకి నీటిని పంపేవారు. వేడినీటిని పంపేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. స్నానవాటికను సర్‌ జాన మార్షల్‌ ‘వాస్తు నిర్మాణంలో ఒక అద్భుతం’గా పేర్కొన్నారు. దీనిని మతసంబంధమైన పండుగ దినాల్లో ఇతర ముఖ్య దినాల్లో ఉపయోగించి ఉండవచ్చు. స్నానవాటిక, దానిని వెంబడించి ఉన్న ఒక పెద్ద కట్టడాన్ని కాటేజీ అని పిలిచేవారు. ఇది మతాధికారి నివాసమై ఉండవచ్చు.
ధాన్యాగారం:- మొహంజొదారోలో 45.71 ్ఠ 15.23 పొడవు, వెడల్పు ఉన్న అతిపెద్ద నిర్మాణమే ధాన్యాగారం. ఇది స్నానవాటికకు పశ్చిమాన ఉంది. హరప్పాలో నిర్మించిన ధాన్యాగార సముదాయం చాలా విశిష్టమైనది. ఇటుకలతో నిర్మించిన ఎత్తయిన వేదిక మీద రెండు వరసల్లో వరసకు ఆరు చొప్పున ధాన్యాగారాలను నిర్మించారు. ఈ ధాన్యా గారాలకు దక్షిణంలో ఎత్తయిన ఇటుక వేదికలపై నిర్మించిన వృత్తాకారపు కళ్లాముల వరసలు బయల్పడ్డాయి. బహుశా వీటిని ధాన్యం నూర్చడానికి ఉపయోగించి ఉంటారు. ఈ కళ్లాముల దగ్గరలోనే రెండు గదులతో నిర్మించిన ఇండ్ల వరసలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూలీలు నివసించి ఉండవచ్చు. లోధాల్‌లో బయల్పడిన వేదికను గిడ్డంగిగా భావించారు. వీటిని ఆహార ధాన్యపు నిల్వలకు ఉపయోగించి ఉంటారు. ధాన్యపు పంపిణి, ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఉండవచ్చు.
సభా మండపాలు:- నగర ప్రజలు సమష్టిగా ఉపయోగించు కోవడానికి ప్రత్యేక సభా భవనాన్ని నిర్మించారు. ఇవి పెద్ద పెద్ద స్తంభాల మీద నిర్మితమయ్యాయి.
నౌకా కేంద్రం:-లోధాల్‌ నగరంలో కాల్చిన ఇటుకలతో నౌకాయాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నిర్మాణ శిథిలాలను పరిశీలిస్తే అది ఎంత ప్రసిద్ధ నౌకా కేంద్రమో మనకు స్పష్టమవుతుంది. 
ముఖ్య నగరాలు:- భారత ఉపఖండంలో దాదాపు 1000 హరప్పా నాగరికతలు తెలిసినప్పటికీ ప్రధానంగా ఈ కింది వాటినే ముఖ్య నగరాలుగా పరిగణిస్తున్నారు. 
హరప్పా:- 
 ప్రథమంగా 1921లో సింధు నాగరికత అవశేషాలు బయల్పడిన నగరం. 
 పశ్చిమ పంజాబ్‌(పాకిస్థాన) లోని మౌంట్‌ గోమరి జిల్లాలో రావి నది తీరాన తవ్వకాల్లో బయల్పడినది. 
ఈ నగరాన్ని కనుగొన్న తరవాత సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలుస్తున్నారు. 
రుగ్వేదంలో పేర్కొన్న ‘హరియుపియా’ నగరం ఇదే అయి ఉండవచ్చు. 
ఇక్కడ విశిష్టమైన ధాన్యాగారాల సముదాయం లభించింది. వరసకు ఆరు చొప్పున రెండు వరసల్లో ఆరు ధాన్యాగారాలు ఉన్నాయి. ఈ నగరాన్ని ‘ధాన్యాగారాల నగరం’ అని పిలుస్తారు. 
 ధోవతి ధరించిన వ్యక్తి విగ్రహం, నర్తిస్తున్న నటరాజ విగ్రహం, సీ్త్రమూర్తి విగ్రహం, ఎర్ర ఇసుక రాయితో చేసిన మానవ విగ్రహం, శవపేటిక, హెచ ఆకారంలోని సమాధి, కంచు అద్దం, అమ్మతల్లి ముద్రిక, పాము ముద్రిక, బార్లీ, గోధుమ పండించిన ఆనవాళ్లు ఈ నాగరికతలో లభించాయి. 
మొహంజొదారో:- 
 సింధు నాగరికతలో అతి పెద్ద నగరం 
 పాకిస్థానలోని సింధు రాష్ట్రం, లార్ఖానా జిల్లాలో సింధు నది తీరంలో ఉంది. 
1922లో దీనిని ఆర్‌.డి. బెనర్జీ కనుగొన్నారు 
 సింధి భాషలో మొహంజొదారో అంటే మృతదేహాల దిబ్బ (ఝౌఠుఽఛీ ౌజ ఛ్ఛ్చీఛీ) అని అర్థం. 
మహా స్నానవాటిక బయల్పడిన నగరం 
 మహా ధాన్యాగారం కూడా ఇక్కడే బయటపడింది 
 సింధు నాగరికత ఉద్యానవనం లేదా నిక్లిస్థాన అని కూడా అంటారు. 
 కంచుతో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం, పశుపతి ముద్ర, గడ్డమున్న పురోహితుడి విగ్రహం ముఖ్యంగా ఇక్కడ లభించాయి. 
చాన్హుదారో:- 
 పాకిస్థానలోని సింధు ప్రాంతంలో మొహంజొదారోకు దక్షిణంగా 130 కి.మీ. దూరంలో ఉంది. 
1931లో మజుందార్‌ కనుగొన్నారు. 
 రక్షణ ప్రాకారం లేని ఏకైక నగరం 
పూసల తయారీకి ప్రధాన కేంద్రం 
 ముద్రికలు, కాంస్య పరికరాలు, సిరాబుడ్డి లభించాయి. 
కాలి బంగన:- 
 రాజస్థానలోని గంగానగర్‌ జిల్లాలో ఘగ్గర్‌ నది ఒడ్డున ఉంది. 
1953లో డా. జి. ఘోష్‌ కనుగొన్నారు. 
 కాలి బంగన అంటే ‘నల్లని గాజులు’ అని అర్థం 
 నాగలితో భూమిని దున్నిన ఛాయలు మొదటగా కనిపించాయి. 
 ఒంటె కళేబరం బయల్పడింది. 
 అగ్నిని పూజించడం, వైద్యా నికి సంబంధించిన ఆధా రాలు లభించాయి. (ఇవి లోధాల్‌లో కూడా లభించాయి) 
 గుండ్రపు ధాన్యాగారాలు లభించాయి. 
ఇటుకలతో అరలు పేర్చి వాటిలో మృతదేహాలను పూడ్చిన ఆధారాలు బయల్పడ్డాయి. 
లోథాల్‌:- 
 గుజరాతలో భోగవా నది ఒడ్డున కనిపించింది 
1957లో ఎస్‌.ఆర్‌. రావు కనుగొన్నారు 
 హరప్పా ప్రజల మొదటి కృత్రిమ ఓడరేవు. ప్రపం చంలోనే మొదటి టైడల్‌ ఆధారంగా నర్మించిన ఓడరేవు 
ఈ నగరాన్ని మినీ హరప్పా, మినీ మొహంజొదారో అని పిలుస్తారు. కాస్మోపాలిటన నగరం అని కూడా పిలుస్తారు. 
 వరి పొట్టు, వరిసాగు ఆనవాళ్లు, చదరంగం ఆట ఆనవాళ్లు, పెయింటెడ్‌ కుండల పరిశ్రమ, ముద్రికలు, తూనిక రాళ్లు, సతీసహగమన ఆనవాళ్లు లభించాయి. 
 పంచతంత్ర కథలతో ఉన్న కుండలు దొరికిన ప్రాంతం. 
బన్వాలి:- 
 హర్యానాలోని హిస్తార్‌ జిల్లాలో కనిపించింది 
సరస్వతి నది ఒడ్డున 1974లో ఆర్‌.ఎస్‌. బిస్త్‌ కనుగొన్నారు. 
వృత్తాకార పట్టణ ప్రణాళిక గల నగరం 
మురుగునీటి పారుదల సౌకర్యం లేని ఏకైక నగరం. 
మట్టితో చేసిన నాగలి నమూనా, కుమ్మరి చక్రం, పులి ముద్రిక, బార్లీ అవశేషాలు ఇక్కడ లభించాయి. 
థోలవీర:- 
ఆర్‌.ఎస్‌. బిస్త్‌, గుజరాత రాష్ట్రంలోని కచ జిల్లాలో దీనిని కనుగొన్నారు. 
మధ్య పట్టణం గల ఏకైక సింధు నాగరికత నగరం 
ఈ నగరాన్ని మూడు భాగాలుగా విభజించారు. (కోట, మధ్య పట్టణం, దిగువ పట్టణం) 
 హరప్పా ముద్రికలు, స్టేడియం, ఏకశిలా స్తంభాలు ఇక్కడ లభ్యమయ్యాయి.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...