Skip to main content

చరిత్రలో ఈరోజు / ఆగష్టు 29

చరిత్రలో ఈరోజు / ఆగష్టు 29

సంఘటనలు

1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్కి దత్తత ఇచ్చారు.

1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.

1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.

1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.

1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.

1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.

1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.

1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.

1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.

1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.

1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.

1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది

1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.

1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్

1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.

1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. 

1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.

జననాలు

1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)

1905: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979)

1926: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .

1928: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని.

1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)

1959: అక్కినేని నాగార్జున, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.

మరణాలు

1950: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (జ.1888)

1976: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత (1960) (జ.1899) .

జాతీయ దినాలు

🔻తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు.

🔻జాతీయ క్రీడా దినోత్సవము - ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...