*తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖➖

"ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట"
■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు.
*■ పద్నాలుగేళ్ల వయసులో ‘పెనుగొండలక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ, పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్రంథాలను రచించిన ఘనత ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులకే సొంతం.*
■ 1914 మార్చి 28న అనంతపురం జిల్లా, పెనుగొండ సమీపంలోని చియ్యేరు గ్రామంలో విద్యావంతుల కుటుంబంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు,తల్లి లక్ష్మిదేవి(ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. తిరుమల తాతాచార్యుల వంశం వారిది.తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. ప్రాథమిక విద్య అనంతరం సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 16వ ఏట తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న పుట్టపర్తికి ప్రవేశం దొరకలేదు. దాంతో దెబ్బతిన్న అభిమానంతో కళాశాల ప్రిన్సిపాల్ ఎదుటే ఐదు శ్లోకాలను సంస్కృతం లో ఆశువుగా చదివి, నిష్ర్కమించిన పుట్టపర్తి కవితా ధారణను చూసి సంబరపడ్డ ప్రధానాచార్యులు, ఆయన కోరిన తరగతి కన్నా పైతరగతిలో ప్రవేశం కల్పించారు.
■ 1938లో నారాయణాచార్యులు ‘విద్వాన్’ పరీక్షకు హాజరయినప్పుడు,తాను రచించి న ‘పెనుగొండలక్ష్మి’ పద్య కావ్యం పాఠ్యగ్రంథం గాదర్శనమివ్వడం ఓ అసాధారణ సన్నివేశం. ‘‘ఇలాంటి అనుభవం ఎదురుకా వడం కన్నా గొప్ప గుర్తింపు, ఒక సాహితీవేత్త కు మరేముంటుంది’’! అంటూ పుట్టపర్తి ఎంతగానో సంబరపడ్డారు.
■ ‘షాజీ’అనే మరో గ్రంథాన్ని పుట్టపర్తి అతి చిన్న వయసులోనే రచించి కనీవినీ ఎరుగని ఓ కొత్త రికార్డు సృష్టించారని విమర్శకులం టారు. తెలుగు తీరాలు, మేఘదూతము, సాక్షాత్కా రము, అగ్నివీణ, గాంధీజీ ప్రస్థానంవంటివి వీరి రచనల్లో కొన్ని. విశ్వనాథ రచించిన ‘ఏకవీర’ నవలను నారాయణా చార్యులు మలయాళం లోకి అనువదించారు.
*■ పుట్టపర్తిరచనలన్నిటిలోకి ‘శివతాండవం’ గొప్ప కీర్తిప్రతిష్టలను సంపాదించింది. గంభీర స్వరంతో భావోద్వేగంతో ఆయన శివతాండ వం గానం చేస్తుంటే,జనం పులకించిపోయే వారు.*
■ 1974లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో పుట్టపర్తి నారాయణాచార్యులను సత్కరించింది.
■ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుట్టపర్తిని, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
■ కవిగా,విమర్శకుడిగా, వాగ్గేయ
కారుడిగా,అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా,అవధానిగా తెలుగు సాహితీక్షేత్రంలో విశేష ప్రజ్ఞాపాట వాలు ప్రదర్శించిన నారాయణాచార్యులు అపర సరస్వతీ పుత్రులు.
*■ తెలుగు సాహిత్యంలో ఆయన కీర్తి అజరామరం. ‘‘నాకు మంత్రోపాసన వల్ల ఏమీ తృప్తి కలగలేదు. దానితోపాటు గృహఛిద్రాలు నన్ను కలవరపెట్టాయి. దేశంలోని సన్యాసు లందర్నీ కలవాలని ఉంది’’ అంటూ బెనారస్, హరిద్వార్, హిమాలయాల గుండా రుషీకేశ్ దాకా కాలినడకనపర్యటించి, హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు.*
■ ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
■ ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లోపండితులు. తుళు, ఫ్రెంచి,పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధతమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు. "లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
■ ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖర శర్మ "ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు.
*■ తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి,ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళువంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.*
*■ భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు.*
■ గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణా చార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు.
*■ ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు అని పలువురుతో ప్రశంసలు అందుకున్నారు.*
■ ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి1990 సెప్టెంబర్ 1న, 76వ ఏటకన్నుమూశారు.
(మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990)
Comments
Post a Comment