చరిత్రలో ఈరోజు / సెప్టెంబర్ 1
సంఘటనలు
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.
1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది.
1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
2006: పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.
2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
జననాలు
1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)
1972: కోట్ల హనుమంతరావు, రంగస్థల ప్రముఖులు, సినిమా నటులు మరియు రంగస్థల అధ్యాపకులు.
1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.
1975: యశస్వి, కవిసంగమం కవి.
మరణాలు
1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
1992: ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త. (జ.1928)
2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. (జ.1929)
జాతీయ / అంతర్జాతీయ దినాలు
🔻ఎల్.ఐ.సి. ఫార్మేషన్ డే
🔻ఉజ్బేకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం
🔻పోషక పదార్థాల వారోత్సవం.
Comments
Post a Comment