Skip to main content

ప్రసిద్ధ కథా రచయిత.. సాహితీ వేత్త.. " కేతు విశ్వనాథరెడ్డి" !!

ప్రసిద్ధకథారచయిత..సాహితీవేత్త.. "కేతు విశ్వనాథరెడ్డి"

★ కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' పొందాడు.

*■ఇతను జూలై 10,1939న వైఎస్ఆర్ జిల్లా  కమలాపురం తాలూకా రంగశాయి పురం గ్రామంలో జన్మిం చాడు.*

*🍥విద్యాభ్యాసం, వృత్తి..*

■ కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభిం చి కడప, తిరుపతి, హైదరాబాదు  లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో  డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు.

*★పాఠ్యపుస్త కాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందిం చాడు.*

*🍥సాహిత్య రంగం..*

■ ఈయన తొలి కథ పునాదిరాళ్ళు1963లో  సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు.'విశాలాంధ్ర తెలు గు కథ 'సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు.

*★ ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. జప్తు, కేతు విశ్వనాథరెడ్డి కథలు మరియు  ఇచ్ఛాగ్ని అనే మూడు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి. ఆధునిక తెలుగు కథా రచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం 'దీపధారులు'. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పని చేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథ రెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ,కన్నడం,మలయాళం,బెంగాలీ, మరాఠీ,ఆంగ్లం,రష్యన్ భాషల్లోకి అనువాదిత మయ్యాయి.*

*■ వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. 'వేర్లు'రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్  మీద వెలువడిన మొట్టమొదటి  నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి 'చదువు కథలు'అనే కథలసంపుటిని సంకలనం చేశారు.*

*🍥పురస్కారాలు..*

*◆ కేంద్ర సాహిత్యఅకాడెమీ అవార్డు(డిల్లీ)*
◆ భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
◆తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
◆రావిశాస్త్రి అవార్డు,రితంబరీ అవార్డులు.
◆విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వంఇచ్చేఉత్తమ అధ్యాపక పురస్కారం.

🍥వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని...

1991 కేతు విస్వనాథరెడ్డి కథలు....... ఆంధ్రజోతి వార పత్రిక.1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.1977 మన ప్రేమకథలు.ఆంధ్రజ్యోతి మాస పత్రిక.
1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.1979 ఆరోజులొస్తే... నివేదిత మాస పత్రిక.1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.2001 కాంక్ష రచన మాస పత్రిక.2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.

*🍥ఇతరుల ప్రతిస్పందనలు..*

● ఆ 'జప్తు' కథలో భాష మా ప్రాంతానికి చెందిందికాదు. అందులోని విచిత్రమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది.
            *-కాళీపట్నం రామారావు(కారా)*

●1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి. *-మధురాంతకం రాజారాం*

● విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుం ది. అలంకారాలుండవు-అనుభూతివుంటుం ది;  కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది *-సింగమనేని నారాయణ*

● సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివే తనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రల ను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు  *-ఓల్గా*

             🍃🌸🤗🌸🍃

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...