Skip to main content

చరిత్రలో ఈ రోజు / జులై 5

చరిత్రలో ఈరోజు: జూలై 5

_*⏱సంఘటనలు*_⏱

*🚩1687: సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు.*
*🚩1811: వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.*

*🚩1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్ట మొదటి సారిగా ప్రదర్శించారు.*
*🚩1954: గుంటూరులో 1954 జూలై 5 నాడుఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు.కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).*

*🚩1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బి.బి.సి.) తన మొట్ట మొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.*

*🚩1962: అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).*

*🚩1975: కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).*

*🚩1977: పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనజుల్ఫికర్ ఆలి భుట్టోను,ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగించారు.*

*🚩1995: సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత,ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.*

*🚩1996: మొట్టమొదటి సారి, క్లోనింగ్ ద్వారా పెద్దగొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారాడాలీ అనే పేరు గల గొఱ్ఱెను శాస్త్రవేత్తలు పుట్టించారు.*

*🚩2004:లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభలోజరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలు పెట్టారు.*

_*❤జననాలు❤*_
*🚩.    1853: రొడీషియా (నేటి జింబాబ్వే) దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్1906: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (మ.1953)*

*🚩1927: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)*

*🚩1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.*

*🚩1979: నవీన షేక్, ప్రముఖ రంగస్థల, సినీ, టివీ నటి.*

*🚩1980: కళ్యాణ్ రామ్, తెలుగు సినిమా నటుడు, నందమూరి తారక రామారావుమనవడు*

*🚩1995: పి.వి. సింధు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేసింది.*

🇮🇳_*పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🚩అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.*

🦅🦅🦅🌿🌿🦅🦅🦅🦅

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...