Skip to main content

చరిత్రలో ఈ రోజు / జూలై 16

చరిత్రలో ఈరోజు/ జులై 16

సంఘటనలు

0622: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. (హిజ్రీ శకం)

1439: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.

1661: బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).

1880: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.

1862: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.

1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.

1926: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.

1936: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.

1941: 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.

1945: "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు..

1945: మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.

1965: 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.

1969: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.

1979: సద్దాం హుస్సేన్, ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.

1990: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.

1972: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది.

1976: ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)

1983: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.1993:బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్

జననాలు

1704: జాన్ కే, ఇంగ్లాండ్, మెషినిస్ట్, ఫ్లైయింగ్ షటిల్ కనుగొన్న శాస్త్రవేత్త.

1746: జియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఏస్టరాయిడ్) కనుగొన్నాడు (గ్రహశకలం పేరు: సెరెస్).

1872: రోల్డ్ అముండ్‌సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).

1940: పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు మరియు రచయిత. [ మరణము. 2014]

1888: ఫ్రిట్జ్ జెర్నికె, 'ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్' ని కనుగొన్నాడు.

1896: ట్రైగ్వె లీ, మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52)

1909: అరుణా అసఫ్ అలీ, స్వాతంత్య్ర సమరయోధురాలు. (మ.1996)

1922: ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)

1923: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (మ.2017)

1924: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు లోక్‌సభ సభ్యురాలు (మ.2007).

1965: శేఖర్ (కార్టూనిస్టు), కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి

1975: భువనేశ్వరి (నటి), తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పాటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది.

1981: గోపీచంద్ లగడపాటి, సిని నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.

1983: కట్రీనా కైఫ్, భారతీయ సినీ నటి

మరణాలు

1999 - ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.

2015: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...