➖➖➖➖➖➖➖➖
*నేడు..ప్రపంచ బాలల దినోత్సవం..*✍
➖➖➖➖➖➖➖
_"నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు"_
*నేడు..ప్రపంచ బాలల దినోత్సవం..*✍
➖➖➖➖➖➖➖
_"నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు"_
*★ వివిధ దేశాలలో 'బాలల దినోత్సవం'*
*అనేది ఒక్కోరోజున జరుపబడు తున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 1948వ సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది.*
■ అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహరాల్ జన్మదినమైన నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

*■ ఈ రోజు బాలల హక్కులు, వారి సంరక్షణ, పోషణ తదితర అంశాల పట్ల ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ఆ యా దేశాలు ఈ రోజున పలు కార్యక్రమాలను చేపట్టడం రివాజు.*
*■ బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్‌ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటుచేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడం లో నూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నప్పటికీ బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన చెందకపోవడం వెనక గల కారణాలను అన్వేషిస్తే పేదరికమే ముందు స్థానంలో నిలుస్తుంది. దానికితోడు పేద కుటుంబ వ్యవస్థకు నానాటికీ పూర్తిగా దూరమవుతున్న విద్య మరో కారణమవు తుంది. బాల వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ప్రవేశపెట్టబడ్డ పధకాలను గురించి తెలుసుకో లేని నిస్సహాయతను ఇది కల్పిస్తోంది.*
■ మెరుగైన సమాచారం వారికి అందుబాటు
లోకి రాకుండాపోతోంది. అందుకు ఏ ఒక్కరినో నిందించనవసరంలేదు. ఇప్పటికే పల్స్ పోలియోను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వికలాంగులకు వీలులేని వ్యస్థను రూపొందించడానికి ప్రభుత్వం ఏళ్ళ తరబడి ఎంతగానో కృషి చేస్తోంది. ఆ దిశలో సాధించిన ముందడుగు సామాన్యమైందేమీ కాదు. పోలియో నిర్మూలనకు నడుంకట్టి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటుకు చేస్తున్న కృషి త్వరలోనే సత్ఫలితాలు ఇవ్వనుంది. దీనితోపాటు హెచ్.ఐ.వి./ఎయిడ్స్‌కు గురైన అమాయక బాలలకు పునరావాసాన్ని కల్పించడంలోనూ నిరంతరం కృషిచేస్తూ ఉంది.

*■ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇప్పుడిప్పుడే చట్టాన్ని సమర్ధవంతంగానూ, కఠినంగానూ అమలుచేసేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా సైకిల్ షాపుల్లోనూ, మెస్సుల్లోనూ, టీ బంకులలోనూ, ఇళ్ళలో పనిమనుషులగానూ బాల్యం కర్పూర హారతై పోతున్న కుటుంబాలలో వెలుగు రేఖలను ప్రసరింపజేస్తోంది. అనేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాలల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తోంది..*
*■ అసలు వీటన్నిటికి తోడు బాలలకు కావలసిందేమిటో వారినుండే తెలుసుకోవ లసిన ఆవశ్యకత కూడా ఉందన్న విషయం ముందుగా గమనించాలి. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తమకు సముచితమనిపించిన పధకాలను రూపొందించడం, తమకు అనువైన రీతిలో వాటిని నిర్వహిస్తూ పోవడం ద్వారా మాత్రమే బాల కార్మిక వ్యవస్థగానీ, బాలలకు సంబంధిన మరే పధకమైనాగానీ ఫలవంతం అవుతుందనుకోవడం సమంజసం కాదు. బాలల మనోభావాలను అర్ధం చేసుకు నే వ్యవస్థ ఆవిర్భావం ముందుగా జరగాలి. బాలలు-వారి పరిసరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. బాలలంటే ఉన్న చులకన భావం పోయి బాల భవిత చల్లన అనే భావన అందరి హృదయాన కలిగిన రోజునే నిజమైన బాలల దినోత్సవం.*
珞
Comments
Post a Comment