Skip to main content

Noble Persons in History - చండ్ర రాజేశ్వర రావు !!


సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు..చండ్ర రాజేశ్వర రావు జయంతి నేడు(6-June)..

■ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గుర్తింపు, గౌరవం పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇద్దరిలో ఒకరు చండ్ర రాజేశ్వరరావు, రెండవ వారు అజరు కుమార్‌ ఘోష్‌.
■ రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న  కమ్మరైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధానకార్యదర్శి గా ఉండి 1992లో ఆనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నాడు.
■ దేశ సమైక్యతను కాపాడడంకోసం బాబ్రీ మసీదు ను మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు
*■ మానవతావాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు.*
■ ఆయన కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్ప టికీ కూలర్‌ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు.
*■పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు."నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు.*
■ పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానా లను విమర్శించినా చాలాఓపికతో వినేవాడు. 
*■ మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు.*
■ హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయం గావెళ్ళేవాడు.
*■ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు.*
*■ శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావు ను అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనే వారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు  నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్ట మొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.*
■1969-73లలో జరిగిన వేర్పాటువాద ఉద్యమాల గురించి ఆయన రాసిన వ్యాసల ను చండ్ర రాజేశ్వరరావువ్యాసావళి-1969-73  వేర్పాటువాద ఉద్యమాలు పుస్తకం రూపంలో తెచ్చారు.
*■ అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను,  శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళి నందుకు రాజేశ్వరరావును `ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌' అవార్డు తో సోవియట్‌ యూనియన్‌, `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి.*
■రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడు
తూ 1994 ఏప్రిల్9న మరణించాడు.ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్‌లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌ లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994)
                   

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...