Skip to main content

Noble Persons in History - కానూరి లక్ష్మణరావు !!


ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కృషి చేసిన..కానూరి లక్ష్మణరావు గారి వర్దంతి (6- June)



★ పదవీ విరమణ చేసాక కేంద్రములో నెహ్రూ మంత్రివర్గములో నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసిన అద్భుత ఇంజనీరు..

1972 లో గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించినది ఈయనే.

■ లక్ష్మణరావు 1902,జూన్ 6 న కృష్ణా జిల్లావిజయవాడ సమీపమున ఉన్న కంకిపాడుగ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి గ్రామ కరణము. బాల్యము నుండే ఈయన ప్రతిభావంతమైన విద్యార్ధిగా పేరు తెచ్చుకొన్నాడు. సుప్రసిద్ధ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వీరి బావ.

■ మద్రాసు విశ్వవిద్యాలయము లో ఇంజనీరింగు (బీ.ఈ) డిగ్రీ పూర్తి చేసి, గిండీ ఇంజనీరింగు కళాశాల నుంచి ఇంజనీరింగులో పోస్టుగ్రాడ్యుయేట్ చేశాడు. ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ (ఎం.ఎస్.సి ఇన్ ఇంజనీరింగ్) పొందిన తొలి వ్యక్తి ఈయనే. కొన్ని రోజులు రంగూన్‌ లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత ఇంగ్లండు లోని బర్మింగ్‌హాం యూనివర్శిటీ నుండి డాక్టరేట్ ను పొందాడు.

■ ఈయన ఇంగ్లండులో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేశాడు. ఆ కాలములో స్ట్రక్చరల్ ఇంజనీరింగు మరియు రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటు అను పుస్తకము రచించాడు.

■ 1946 లో భారత దేశము తిరిగివచ్చి మద్రాసు ప్రభుత్వములో డిజైన్ ఇంజనీరుగా పనిచేశాడు. 1950 లో ఢిల్లీలో విద్యుత్ కమీషనులో డైరెక్టరు (డిజైన్స్) పదవిని నిర్వహించాడు. 1954 లో చీఫ్ ఇంజనీరు గా ఉన్నతి పొందాడు. ఈయన కేంద్ర వేర్‌హౌసింగ్ కార్పోరేషన్ లొ సభ్యుడు. 1957 లో పదవీ విరమణ పొందినా 1962 వరకు సభ్యునిగా కొనసాగాడు.

■ 1962 నుండి 1977 వరకు మూడు పర్యాయములు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు.

■ ఈయన నెహ్రూ, లాల్‌ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీల మంత్రివర్గములలో పది సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల మరియు విద్యుఛ్ఛక్తి శాఖా మంత్రిగా పనిచేశాడు. అనేక భారి ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉన్నది.

■ ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలములో అనేక జలవిద్యుఛ్ఛక్తి మరియు నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశాడు. ప్రపంచములోనే అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జునసాగర్ ఈయన రూపకల్పన చేసినదే.

■ మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికా కాలములలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం మరియు తుంగభద్ర ప్రాజెక్టు లకు రూపకల్పన చేశాడు.
■ ఈయన స్మృత్యర్ధము పులిచింతల ప్రాజెక్టు కు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణము చేయబడినది. ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమము.

కె.ఎల్.రావు ప్రతిపాదనలు..

★ నదులపై భారీ డ్యాములకు బదులు బ్యారేజీలు మినీ రిజర్వాయర్ లు విస్తృతంగా కట్టాలి.
★ నదుల కరకట్టలనే నాలుగు లైన్ల రహదారులుగా మార్చాలి.

పురస్కారాలు..

★1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరవ పట్టాను ప్రదానం చేసింది.
★ 1963లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.
★ఇంజనీరుగా చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా మూడు పర్యాయాలు రాష్ట్రపతి పురస్కారం లభించింది.
(1902,జూన్6-1986,మే 18)
       

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...