Skip to main content

Noble Persons in History - బాబు జగ్జీవన్ రామ్ !!


భారత ఉప ప్రధాని..అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన.."బాబు  జగ్జీవన్ రాం" 


■ఆలోచనల్లో దార్శనీకత, మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్థులతో సైతం ఔరా అన్పించుకోగల్గిన రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం.

■ అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌’గా పిలవబడ్డాడు.

■ పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు.విద్యావేత్త గా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్వి న శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రి గా  ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు..

■ చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రం లో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. 

■ పాఠశాలలోని వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అందరికీ ఒకే మంచి నీటి కుండను ఏర్పాటు చేయించారు. జగ్జీవన్‌లోని తెలివి తేటలను, జ్ఞాన తృష్ణను గమనించిన పండిట్ మదన్‌ మోహన్ మాల వీయ ప్రోత్సాహం కారణంగా ఆయనకు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కలిగింది. ఆ తదుపరి కలకత్తా విశ్వవిద్యాల యం నుంచి బి.ఎస్.సి. లో డిస్టింక్షన్ సాధిం చారు. అక్కడ చదువు తుండగానే 35 వేల మంది కార్మికులతో బహిరంగ సభను నిర్వహించి బోస్‌బాబు వంటి వారి దృష్టిని ఆకర్షించారు. మార్క్స్ రచనలను చదివి వర్గ రహిత, కుల రహిత సమాజంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకున్నారు. 1934 బీహార్ భూకంప బాధితుల సేవలో నిర్విరా మంగా శ్రమించారు. అప్పుడే  గాంధీజీని  చూసి ప్రభావితులయ్యారు.నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్య మంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు.

■ ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్షం కోరల నుంచి తప్పించి, మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించి ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధం అయ్యేలా చేసింది జగ్జీవన్‌రామ్.

■ స్వాతంత్య్ర భారతంలో  దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణను చూరగొన్న దళితనేత బహుశా బాబూ జగ్జీవన్‌రామ్ ఒక్కరే. 1936లో మొదటిసారి బిహార్ విధాన సభకు ఎన్నికైనప్పటి నుంచీ,  కన్ను మూయడానికి రెండేళ్ల ముందు, 1984లో పార్లమెంటేరియ న్‌గా కొనసాగే వరకూ ప్రతి ఎన్నికలలోనూ ఆయన గెలుపొందారు. అయితే దళితులకు రాజకీయ సాధికారత కల్పించే కృషిని ఆయన ఇంకా ముందే, 1935 లోనే ప్రారంభించారు. ఆ సంవత్సరంలోనే ఆయన హమ్మండ్ కమిషన్ ముందు హాజరై, 1936-37 ఎన్ని కలలో దళితులు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని నొక్కి చెప్పారు. ఒక వ్యక్తికి ఒక ఓటు, ప్రతి ఒక్కరి ఓటుకూ ఒకే విలువ అనే సూత్రం కింద దళితులు ఓటు హక్కును పొందడం అప్పటి నుంచే మొదలైంది.

■ స్వాతంత్య్రానంతర భారతదేశ నిర్మాణంపై బాబూజీ తనదైన చెరగని ముద్రవేశారు. కేంద్రంలో కార్మిక శాఖ, రైల్వేలు, రవాణా- కమ్యూనికే షన్లు, ఆహారం-వ్యవసాయం, సేద్యపు నీరు- రక్షణ వంటి అనేక కీలక శాఖలు నిర్వహించారు. కార్మిక సంక్షేమం కోసం కాలపరీక్షకు నిలిచే విధానాలను, చట్టాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. పారిశ్రామిక వివాదాల చట్టం- 1947, కనీస వేతనాల చట్టం-1948, భారత కార్మిక సంఘాల సవరణ చట్టం-1960, బోనస్ చెల్లింపు చట్టం-1965 వంటి చరిత్రాత్మక చట్టాలను తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అంతేకాదు, ఎంప్లా యీ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం-1948, ప్రొవిడెంట్ ఫండ్ చట్టం-1952 తీసుకురావడం ద్వారా ఆయన ఆనాడే సాంఘిక భద్రతా చర్యలకు పునాదులు వేశారు.

■ రైల్వేమంత్రిగా ఉన్నపుడు బ్రహ్మపుత్ర మీద వంతెనను నిర్మింపచేయడంలో ఆయన ఎంతో దూర దృష్టిని కనబరిచారు.ఈశాన్య రాష్ట్రాల కు ఉన్న వ్యూహాత్మకమైన ప్రాముఖ్యం దృష్ట్యా కూడా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో అనుసంధానం చేయడానికి సాధ్యమైంది.

■1957లో రైల్వే మంత్రిగా ఉండి బాబూజీ తీసుకున్న చొరవ ఫలితంగానే ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ మొదటిసారి అమలులోకి వచ్చింది. ఆయన నిర్ణయంపై నిరసన, వ్యతిరేకత ఎదురవడంతో విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆయన నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు జరుగుతోంది.

■ రక్షణ మంత్రిగా బాబూజీ ప్రతిష్ట శిఖరా గ్రానికి చేరింది. ఇందిరాగాంధీ అందించిన స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో బంగ్లాదేశ్ విముక్తి ఘట్టాన్ని ఆయనే పర్యవేక్షించారు. 1971, డిసెంబర్ 16న స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించినట్టు ఆయన చరిత్రాత్మక ప్రకటన చేస్తూ, ‘‘బంగ్లాదేశ్‌లోని పశ్చిమ పాకిస్తాన్ దళాలు బేషరతుగా లొంగిపోయాయి... డక్కా (నేడు ఢాకా అంటున్నాం) ఇప్పుడు ఒక స్వతంత్ర దేశానికి ఒక స్వతంత్ర రాజధాని’’ అన్నారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలకే, తొమ్మిది మాసాల యుద్ధం తర్వాత భారత-బంగ్లా సంయుక్త దళాల చేతిలో పాకిస్తాన్ దళాలు ఓటమిని అంగీకరించాయి.

■ ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్షం కోరల నుంచి తప్పించి, మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించి ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధం అయ్యేలా చేసింది జగ్జీవన్‌రామ్. పి.ఎల్. 480 అనే అవమాన కరమైన షరతు మీద అమెరికా నుంచి గోధుమల దిగుమతిని ఆయన ఆపించారు. జన సామాన్యానికి ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందేలా పౌర పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దారు.

■ బాబూ జగ్జీవన్‌రామ్ సామాజిక న్యాయాన్ని గట్టిగా కాంక్షించిన నాయకుడు. సమాజంలోని ప్రతి వర్గానికి  సమానంగా న్యాయం అందాలని నిరంతరం తపించేవారు.

 ■ 1945లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య సిమ్లాలో జరిగిన చర్చలలో (ఇవే కేబినెట్ మిషన్ ప్లాన్‌కు దారితీయించాయి) దళితుల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకోలేదని ఆయన భావించారు. కేబినెట్ మిషన్ దళితుల పట్ల న్యాయంగా వ్యవహరించలేద న్న  డా. అంబేద్కర్ అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తూ; ‘‘రాజ్యాంగ శాసనసభలోనూ, ఆయా పరగణాల శాసనసభలలోనూ జనాభా దామాషాను బట్టి ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వా’’ లన్న డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ డిమాండ్‌ను నొక్కి చెప్పారు. 1940ల వరకూ దళితుల అభివృద్ధికి పెద్దగా జరిగింది ఏమీలేదని గ్రహించి జగ్జీవన్‌రామ్ తన వైఖరిపై పునరాలోచించుకున్నారు.కాంగ్రెస్ అగ్రవర్ణ హిందువుల పార్టీ అని 1944లో వేవెల్ చేసిన చిత్రీకరణను ఆమోదించడానికి కూడా ఇది ఆయనను పురి గొల్పింది.

■ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఎస్సీ అధికారులు కొద్దిమందే ఉండేవారు. ముఖ్యమంత్రులుగా అగ్రకులాల వారే ఉండేవారు. ఈ పరిస్థితిలో బాబూజీకి గల రాజకీయ ప్రాబల్యం, ఆయనకు గల ప్రజాబలమే డా. అంబేద్కర్ తర్వాత ఎస్సీ, ఎస్టీల ప్రగతికి ప్రధాన చోదకశక్తిగా ఆయనను వీరంతా గుర్తించేలా చేశాయి. వీరు రిజర్వేషన్లను అమలు చేసేలా, ఎస్సీ, ఎస్టీలకు ఇతర పథకాలు ప్రారంభించేలా, హాస్టళ్లను ఏర్పాటు చేసేలా, అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేసేలా బాబూజీ చేయగలిగారు. అస్పృశ్యతా నిర్మూలన చట్టాన్ని తేవడంలోనూ ఆయనదే కీలకపాత్ర. 1967లో దీనినే సవరించి పౌరహక్కుల చట్టం-1955 అని పేరుపెట్టారు.

■ 1975లో ఇందిర విధించిన అత్యవసరసర పరిస్థితికి నిరసనగా 1977లో జగ్జీవన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేశారు. తదుపరిదాన్ని జనతా పార్టీలో విలీనం చేసి రక్షణశాఖ ను చేపట్టారు. 1979లో ఉప ప్రధాని పదవిని స్వీకరించారు. జనతా ప్రభుత్వ పతనం తదుపరి ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఐదు దశాబ్దాల పార్లమెంటరీ చరిత్ర గలిగిన విశిష్ట నేతగా చిరస్మరణీయులైన జగ్జీవన్ 1986 జూలై 6న 78వ ఏట తుది శ్వాస విడిచారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బాబూజీ స్మృతి అజరామరం, ఆయన కృషిని కొనసాగించడానికి కంకణబద్ధులం కావడమే ఆయనకు అర్పించగల నివాళి.

 (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) 

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...