నాకో కల ఉంది! అంటూ..అమెరికన్ పౌర హక్కులను కాపాడిన ఉద్యమకారుడు.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.. 'మార్టిన్ లూథర్ కింగ్'
‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు! ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్.
■ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాకు చెందిన పాస్టర్,
ఉద్యమకారుడు మరియు ప్రముఖ ఆఫ్రికన్-అమెరిక న్ పౌరహక్కుల ఉద్యమ కారుడు.
■ ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించ డం, మరియు ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉంది.
■ మార్టిన్ అసలు మేరు మైఖేల్. తర్వాత మార్టిన్ అయ్యాడు. తండ్రి (మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్) బాప్టిస్టు మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మతబోధకుడు. తల్లి ఆల్బెర్టా విలియమ్స్ కింగ్. పాఠశాల ఉపాధ్యాయిని. మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు పరిచయం అయిన కొరెట్టా స్కాట్‌ను 1953లో ఆయన వివాహం చేసుకున్నారు.సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు, ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు.
■1954లో మాంట్‌గోమరీ (అలబామా) లోని డెక్స్‌టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టరుగా నియమితులయ్యారు. ఆ ఏడాదే అలబామాలో సంచలనాత్మకమైన అరెస్టు ఒకటి జరిగింది. మార్టిన్ సహచరురాలైన పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు 'రోసా పార్క్స్' తను ప్రయాణిస్తున్న బస్సులో ఒక తెల్లవాడికి తను లేచి సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకు అరెస్ట్ అయ్యారు! పార్క్స్ అరెస్టును నిరసిస్తూ మాంట్‌గోమరీలో బస్సులను ఆఫ్రికన్ అమెరికన్లు బహిష్కరించే ఉద్యమానికి మార్టిన్ నాయకత్వం వహించడంతో తొలిసారిగా అమెరికాలో ఆయన పేరు మారుమోగింది!
■1963లో బర్మింగ్‌హామ్, అలబామాలలో జాతి వివక్షకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవాళ్లు అత్యంత పాశవికంగా బాంబులతో అణచివేశారు. నల్లవారి ఇళ్ల మీద, కార్యకర్తల మీద తరచు బాంబు దాడులు జరుగుతుండ డంతో బర్మింగ్‌హామ్ ‘బాంబింగ్‌హామ్’గా పేరుమోసింది! నిరసనలకు వ్యతిరేకంగా జారీ అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడం తో మార్టిన్‌ను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు.
■ జైలు నుంచి మార్టిన్ విడుదల అయ్యాక ‘చిల్డ్రన్స్ క్రూసేడ్’ మొదలైంది. వేలాది మంది పాఠశాల విద్యార్థులు మార్టిన్ దన్నుతో బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు.
■ వారిపై పోలీసులు విరుచుకు పడ్డారు. లాఠీలను ఝుళిపించడం, పోలీసు కుక్కల్ని ఉసిగొల్పడం, జ్వాలలను ఎగజిమ్మే పైపులను విద్యార్థులపైకి గురిపెట్టడం వంటి దృశ్యాలన్నిటినీ టీవీలలో చూసి అమెరికా ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. మార్టిన్‌కు మద్దతు ప్రకటించారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే మార్టిన్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు.
■ 1964 లో,అతిపిన్న వయస్సులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు.ఇతని ఈ పురస్కా రం తన రేషియల్ సెగ్రిగేషన్ మరియు జాతివాదం జాతి వివక్షలపై వ్యతిరేకంగా సాగించి న కృషికి, ఆ కృషిలో అవలంబిం చిన పౌర నిరాకరణ మరియు అహింస వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడ్డాడు, మరియు వియత్నాంయుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించాడు.
■ 1967 డిసెంబరులో మార్టిన్ ‘పూర్ పీపుల్స్ కాంపెయిన్’ ప్రారంభించారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ 3 వ తేదీన టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ చేరుకున్నారు మార్టిన్. మర్నాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు.
■ఇతని మరణాంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ 1977లో నూ, మరియు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ 2004 లో నూ ప్రసాదింపబడింది. మార్టిన్ లూథర్ (Government of America) అమెరికా ప్రభుత్వంచే జాతీయ సెలవు దినంగా 1986 లో ప్రకటింప బడింది.
■ ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘీక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.
(జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968)

Comments
Post a Comment