Skip to main content

Noble Persons in History - నార్ల తాతారావు !!


ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు,ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ తార..
"నార్ల తాతారావు" 



■ నార్ల అంటే ఒక విద్యుత్‌ తార. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వెలుగులకు ఒక ఇంధనం.పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.

■ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో సగానికి పైగా తీరుస్తూ, తన వైశిష్ట్యాన్ని చాటుకుంటోంది. విజయవాడకు 15 కిలో మీటర్ల దూరంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల సరిహద్దుల మధ్య 1973లో దీనిని ఏర్పాటు చేశారు. ఆనాటి కేంద్ర మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు, విద్యుత్తు బోర్డు ఛైర్మన్ నార్ల తాతారావులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

■ నార్ల తాతారావు కృష్ణా జిల్లా  కౌతవరం  గ్రామంలో 1917మార్చి 8వ తేదీన జన్మించాడు. అక్కడే  ప్రాథమిక విద్యనభ్యసించాడు.  బెనారస్ హిందూవిశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని  ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్‌ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించి, పిదప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు.

 ■ ఆతర్వాత మధ్యప్రదేశ్‌  విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగం లో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లుదేశానికంతటికీ ఆదర్శమయ్యాయి.  1974 నుంచి  1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసి, ఎపిఎస్‌ఇబి విద్యుత్‌ రంగంలో అగ్రగామిగా నిలబెట్టాడు.

■ నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించాడు.

■ రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించాడు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.

■ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు వదులుకొని స్వతంత్య్ర భారత నిర్మాణంలో పాలుపంచు కోవడానికి వచ్చారని తెలిపారు. విదేశీ యంత్ర పరికరాలను అరికట్టి, స్వదేశీ యంత్రపరిక రాలను ప్రోత్సహించి అద్భుత విజయాలు సాధించారన్నారు. వేక్యూమ్‌ బ్రేకర్స్‌, సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌, డిస్ట్రీబ్యూషన్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ను సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌పార్మర్‌ను విజయవాడ థర్మల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఘనత నార్లవారిదే.

పదవులు..
■ డివిజనల్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖకార్యదర్శి, విద్యుత్ బోర్డు, మధ్య ప్రదేశ్ఛీఫ్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖఛైర్మన్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ కమీషన్ఛైర్మన్, సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్లుకమిటీఛైర్మన్, ఎనర్జీ రీసర్చ్ శాఖ, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధక పరిషత్ అధ్యక్షుడు, కేంద్రీయ జల విద్యుత్ సమితిడైరెక్టర్, భారత అల్యూమి నియమ్ కంపెనీఅడ్వైజర్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డ్

పురస్కారాలు
■ విద్యుత్తు రంగానికి విశిష్ట సేవ లందించి నందుకు గాను 1983లో  కేంద్ర ప్రభుత్వం ఆయన ను పద్మశ్రీ అవార్డుతో  సత్కరించింది.

■ 1985లో భారతరత్న విశ్వేశ్వర య్య అవార్డు, 1999లో తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, 2000లో మాస్‌ ఆఫ్‌ది సెంచరీఇన్‌ ఇండియన్‌ ఎలక్ట్రీకల్‌ పవర్‌ అవార్డులు అందుకున్నాడు.

■ నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న,హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వర రావు తాతారావుకు సోదరుడు.

(జ:మార్చి8,1917- మ:ఏప్రిల్ 7,2007)
                     

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...