రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో తిరుగుబాటు పతాకమును ఎగురవేసిన
'మంగళ్ పాండే '
■ బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు. మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సుగల బ్రాహ్మణ యువకు డు. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు.
■1827,జూలై19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో మంగళ్ పాండే జన్మించారు.మంచి సాహసవంతుడు అయిన పాండే తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐ లో చేరాడు.
1857 సిపాయిల తిరుగుబాటు.
■ కోల్ కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు పి.53 రైఫిల్కు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవినచ్చలేదు.
■ అప్పట్లో ఝాన్సీలక్ష్మి బాయి కి కూడా సహకారం అందించారు పాండే గారు. దీంతో అప్పటినుండి ఉద్యమం మరింత ఎక్కువగా భారతమంతటా వ్యాపించింది. కాకతాళీయం గా పాండే హీరో అయ్యాడని, భంగు ను సేవించిన మత్తులో బ్రిటీష్ అధికారిపై దాడి చేశాడన్న వాదనలూ ఉన్నాయి.
■ 1857, ఏప్రిల్8న పాండేను ఆయనకు సహకరించాడన్న ఆరోపణపై సహచర సిపాయిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పాండేపై చర్య తీసుకోమని హేవ్ సన్ అనే సైనిక అధికారి ఆదేశించినా సాటి సిపాయిలు వ్యతిరేకించారు.
■ సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలిస్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. అప్పటి వరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచన లను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !
■ ఏదేమైనా కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్పఉద్యమ కారుడు. భారతదేశ స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు . ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం.
☄గౌరవార్థం-తపాళా బిళ్ళ..
■ భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం, అక్టోబరు 5, 1984 న ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది. దీని చిత్రకారుడు ఢిల్లీకి చెందిన సి.ఆర్.ప్రకాశ్.
(జ: జూలై 19,1827–మ: ఏప్రిల్ 8,1857)


Comments
Post a Comment