భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్. అధికారిణి..కిరణ్ బేడీ
★1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007 లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.
⭐బాల్యం, విద్యాభాసం..
■ కిరణ్ బేడీ జూన్ 9, 1949 నాడు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్లో ప్రకాశ్ రావ్ పేశవారియా, ప్రేమలత పేశవరియా అనే దంపతలుకి జన్మించింది. తల్లిదండ్రులకు నలుగురు కూతూర్లలో ఈమె రెండవది. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విద్యా భాసం కొనసాగించింది. 1968-70 లో రాజనీతి శాస్త్రంలోపంజాబ్ విశ్వవిద్యాల యం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది.
1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి.పట్టాను ప్రధానం చేసింది.
■ కిరణ్ బేడీ చిన్నవయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందినది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొం దింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిన్‌ను గెలుపొందినది.
■ 1972లో జూలైలో మొట్టమొదటి ఐ.పి.యస్ గా ఎన్నికైనారు.
■ 1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ.పి.యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చ ర్యాలకి లోనయ్యారు. ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.
■ 1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీయిన్చివేసింది. ఆసమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణ పట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు.
■1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు.
⭐ఉద్యోగ జీవితం..
■ కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72) . 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది.
■ ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది.
■ 9 వేల మంది ఖైదీలున్న తీహార్ జైలకు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డుపొందినది.*
⭐ఆత్మకథ..
■ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్ సలహాదారు గా నియమింపబడిన తొలి మహిళ కిరణ్ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్ బేడీ.
⭐సాధించిన అవార్డులు..
1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
1991 : మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
1995 : మహిళా శిరోమణి అవార్డు
1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)
జ:జూన్ 9,1949 (వయస్సు: 68 సం"లు)
🍃🌸🤗🌸🍃
Comments
Post a Comment