Skip to main content

International Health Day !!


⛑➖➖➖➖➖➖➖➖
*నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..*✍ 
➖➖➖➖➖➖➖➖
■ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా జరుపుకుంటారు.
■ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. కాలానుగుణంగా వస్తున్న కొత్త  వ్యాధులకు మానవుడికి సరికొత్త వైద్య సదుపాయాలు అందజేయడం దీని లక్ష్యం. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల ఆమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.
*■ మొదటిసారిగా 1948 ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO వారు నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సరఫరా, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో నిర్ణీత ప్రాంతాలలో అవగాహన కల్పిస్తుంది..*
■ ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి థీమ్ (నినాదం) ఏమనగా..
*'డిప్రెషన్‌పై మౌనం వీడండి..మాట్లాడండి’*
■ మనం అనుకున్నది నెరవేరకుంటే ఏదోలా ఉంటుంది. అది సహజం. అయితే దాని వల్ల జీవితం నిస్సారమైందని భావించకూడదం టున్నారు మానసిక వైద్య నిపుణులు. సరైన దృక్పథంతో ఆలోచించగలిగితే భవిష్యత్‌పై నమ్మకం పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని అంటున్నారు. జీవితం ఆశాజనకంగా కన్పించాలంటే ముందుగా మౌనం వీడాలని.. హాయిగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు. 
*■ డిప్రెషన్‌ అనేది సర్వసాధారణమైన మానసిక సమస్య. 14 రోజులకు మించి రోజూ దిగులుగా ఉండడం, రోజువారీ దైనందిన కార్యక్రమా లపై ఆసక్తి తగ్గిపోవడం, శారీరక జబ్బు లేకపోయినా చిన్నచిన్న పనులకు త్వరగా అలసిపోవ డం, నిద్రపట్టకపోవడం, ఆకలి మందగించడం, ధ్యాస లోపిం చడం, సెక్స్‌ పట్ల ఉత్సాహం తగ్గడం, చిన్న విషయాలను సైతం విసుగు, కోపగించుకోవ డం, జరిగిపోయిన ఘటనలకు సంబంధించి అతిగా పశ్చాత్తా పం చెందడం, తనకు తాను శిక్షించుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించ డం... ఈ లక్షణాలు ఉంటే మనం డిప్రెషన్‌కు గురవుతున్నట్లే.*
*♻డిప్రెషన్‌కు గురైతే..*
◆మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలవుతారు.
◆చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులకు గురవుతారు.
◆మందులకు లొంగని తలనొప్పి, వెన్నునొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి చర్మవ్యాధులు, ఇతర శారీరక జబ్బులు ఎక్కువ అవుతాయి.
◆వృత్తిపరంగా ధ్యాస లోపించి పని సామర్థ్యం తగ్గుతుంది. కుటుంబ కలహాలకు దారి తీస్తుంది.
◆కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో పాటు సమాజంలో ఉన్న వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.
*♻డిప్రెషన్‌ ఎందుకొస్తుంది?..*
*■ కోరికలు నశించడం, పని చేసే సామర్థ్యం కొరవడడం, నెగిటివ్‌ ఆలోచనలు, జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం, బాగా కావాల్సిన వారి ఆకస్మిక మరణం ఇతరత్రా కారణాల వల్ల డిప్రెషన్‌ ఏర్పడవచ్చు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి తమ చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది.*
*♻'మాటలే’ పరిష్కారం..*
■ డిప్రెషన్‌ను నివారించే ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల ఇది నయంకాదు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం, సైకాలజిస్ట్‌ కౌన్సెలింగ్‌ వల్ల డిప్రెషన్‌ను అదుపు చేయవచ్చు. మానసిక వైద్య శాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో మానసిక జబ్బులకు కారణం ‘పాపం చేశారని, శాపం వంటిదని, తప్పులు చేసే వారికి సంక్రమిస్తాయని, చేతబడి, పీడ, దెయ్యం వంటికి పట్టాయన్న మూఢనమ్మకాలతో భూత వైద్యులు, మంత్ర వైద్యులకు చూయించుకునేవారు. ఈ క్రమంలో జబ్బు తీవ్రత పెంచుకుని ఏళ్ల తరబడి ఆలనాపాలనకు నోచుకోక గృహ నిర్బంధంలో మగ్గేవారు. కానీ ఇవన్నీ తప్పని, మానసిక సమస్యలకు మెదడులో కలిగే రసాయనాల ఒడిదుడుకులే కారణమని వైద్యశాస్త్రం నిరూపించింది. శారీరక జబ్బుల్లానే మానసిక జబ్బులు వస్తాయని తేల్చింది. మనసును బాగా చూసుకుంటే చాలా రకాల శారీరక జబ్బులను జయించవచ్చు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ‘మాట్లాడుకోవాలి’ అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.  
*♻జాగ్రత్తలు తీసుకోవాలిలా...*
★డిప్రెషన్‌కు లోనైన వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. ఆ వ్యక్తికి సన్నిహింతంగా ఉంటూ విషయం ఏమిటో కనుక్కోవాలి. ఎప్పటి నుంచి అలా విచారంగా అనిపిస్తుందో అడగాలి.
★వారి తలకు నూనె పట్టించి మసాజ్‌ చేయాలి
★గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలని చెప్పాలి
★‘ఇంత చిన్న విషయానికి బాధపడతావెందుకు’ వంటి మాటలు చెప్పి వారిలో మానసిక స్థైర్యం పెంపొందించాలి.
★చాలా సార్లు చెప్పినా భోజనం చేయకపోతే పక్కనే కూర్చుని మీ చేత్తో కలిపి తినిపించాలి.
★బయట అలా తిరిగొద్దామనో, సినిమాకు వెళ్దామనో చెప్పి వెంట తీసుకెళ్లాలి
*■ డిప్రెషన్‌ అనేది పూర్తిగా నివారించదగిన సాధారణ మానసిక జబ్బు. మొదటి దశలోనే లక్షణాలను గుర్తించి ఆప్తులతో సమస్యను పంచుకోవాలి. లోలోపల కుమిలిపోకుండా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.*
                      珞

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...