Skip to main content

General Knowledge - భారత స్వాతంత్ర పోరాటం

*1909 భారత ప్రభుత్వ చట్టానికి ఉన్న మరొక పేరు*?
1. 1920 ఆగస్టులో భారత జాతీయోద్యమంలో జరిగిన అతిపెద్ద చారిత్రక ఉద్యమం?
ఎ. సకలజనుల సమ్మె
బి. ఉప్పు సత్యాగ్రహం
సి. సహాయ నిరాకరణోద్యమం
డి. పైవేవీకాదు
2. భారతదేశం బ్రిటీషు ప్రభుత్వం ప్రత్యక్షపాలన క్రిందకు ఏ సంవత్సరంలో తీసుకురాబడింది?
ఎ. 1958 బి. 1985
సి. 1968 డి. 1758
3. భారత జాతీయ కాంగ్రెస్‌ ఎవరి చొరవతో ఆవిర్భవిం చింది?
ఎ. డల్హౌసి బి. కారన్‌వాలిస్‌
సి. విన్‌స్టన్‌ చర్చిల్‌ డి. ఎ.ఓ. హ్యూం
4. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
ఎ. 1885 బి. 1985
సి. 1785 డి. 1685
5. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఎ. రమేష్‌చంద్ర బెనర్జి బి. సురేష్‌చంద్ర బెనర్జీ
సి. ఉమేష్‌చంద్ర బెనర్జి డి. దినేష్‌ చంద్రబెనర్జి
6. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ తేదీన తన మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంది?
ఎ. డిసెంబర్‌ 28, 1885 బి. నవంబర్‌ 28, 1885
సి. అక్టోబర్‌ 28, 1885 డి. సెప్టెంబర్‌, 1885
7. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది?
ఎ. ఢిల్లీ బి. హైదరాబాద్‌
సి. కోల్‌కతా డి. ముంబయి
8. అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌ తన 2వ సమావేశంలో ఎక్కడ జరుపుకుంది?
ఎ. 1886 కలకత్తా బి. 1887 ముంబయి
సి. 1888 పూణె డి. 1889 బెంగళూరు
9. భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించుకున్న సమావేశానికి హాజరైన ప్రముఖ ఆంగ్లేయ గవర్నర్‌ జనరల్‌?
ఎ. లార్డ్‌కన్నింగ్‌ బి. లార్డ్‌డెఫ్రిన్‌
సి. లార్డ్‌ మైఖెల్‌ డి. విలియం బెంటింగ్‌
10. భారత జాతీయ కాంగ్రెస్‌ సంస్థపై బ్రిటీష్‌ ప్రభుత్వం మొదటిసారి ఏ సంవత్సరంలో ఆంక్షలు విధించింది?
ఎ. 1886 రెండవ సమావేశం అనంతరం
బి. 1887 మూడవ సమావేశం అనంతరం
సి. 1885 మొదటి సమావేశం అనంతరం
డి. పైవేవీ కావు
11. డా. రమేష్‌ చంద్ర మజుందారి మొత్తం జాతీయోద్యమ చరిత్రను ఎన్ని దశలుగా విభజించారు?
ఎ. నాలుగు దశలు బి. ఐదు దశలు
సి. మూడు దశలు డి. ఆరు దశలు
12. భారత జాతీయోద్యమ చరిత్రలోని మొదటి దశను ఏ సంవత్సర మధ్య కాలాన్ని పేర్కొనవచ్చు?
ఎ. 1885-1905 బి. 1785-1885
సి. 1885-1995 డి. 1665-1885
13. భారత జాతీయోద్యమ చరిత్రలో మొదటి దశను ఏమని పిలుస్తారు?
ఎ. అతివాదదశ బి. మితవాద దశ
సి. గాంధీయుగం డి. సుభాష్‌ చంద్రబోస్‌ యుగం
14. భారత జాతీయోద్యమంలోని 2వ దశను ఏ కాలం మధ్య పేర్కొనవచ్చు?
ఎ. 1885-1905 బి. 1885-1915
సి. 1905-1920 డి. పైవేవీకాదు
15. భారత జాతీయోద్యమంలోని రెండవ దశను ఏవిధంగా పేర్కొనవచ్చు?
ఎ. అతివాద దశ బి. మితవాద దశ
సి. అతిమితవాద దశ డి. మిత అతివాద దశ
16. మితవాదులు ఏ పద్ధతుల ద్వారా బ్రిటీష్‌ పాలకులను ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు?
ఎ. విధి నిరసన, నిర్ణయం
బి. విజ్ఞప్తి, ప్రార్థన, ప్రదర్శన
సి. ధర్మం, న్యాయం, సేవ
డి. పైవన్నీ
17. భారత జాతీయోద్యమ చరిత్రలో మితవాదుల మౌలిక విధానాలు ఏ సంవత్సరం వరకు ప్రభావితం చేయగలిగాయి?
ఎ. 1920 బి. 1930
సి. 1903 డి. 1905
18. బ్రిటీష్‌ ప్రభుత్వం, భారత దేశం పట్ల అనుసరిస్తున్న విధానాలను ఆర్థిక దోపిడి విధానంగా అభివర్ణించింది ఎవరు?
ఎ. జవహర్‌లాల్‌ నెమ్రూ బి. మహాత్మాగాంధీ
సి.దాదాబాయినౌరోజి డి.సుభాష్‌ చంద్రబోస్‌
19. మరాఠి, కేసరి పత్రికల ద్వారా బ్రిటీష్‌ ప్రభుత్వ పాలనా దోషాలు ప్రజలకు తెలియజేసింది?
ఎ. లాలాలజపతిరారు బి. బాలగంగాధర్‌తిలక్‌
సి. బిపిన్‌ చంద్రపాల్‌ డి. అరబింద్‌ఘోష్‌
20. భారతదేశ జాతీయోద్యమ చరిత్రకి గొడ్డలిపెట్టులాంటి సంఘటనగా దేన్ని పేర్కొనవచ్చు?
ఎ. కాంగ్రెస్‌లో చీలిక బి. లక్నో ఒప్పందం
సి. బెంగాల్‌ విభజన డి. బెంగాల్‌ పునరేకీకరణ
21. భారతదేశ రాజధాని నగరం ఎవరి కాలంలో కలకత్తా నుండి ఢిల్లీకి మారింది?
ఎ. బర్దన్‌ బి. రిప్పన్‌
సి. లిట్టన్‌ డి. కర్జన్‌
22. 1909 భారత ప్రభుత్వ చట్టానికి ఉన్న మరోక పేరు?
ఎ. సిడ్నీ చట్టం బి. రౌలత్‌ చట్టం
సి. తెల్లచట్టం డి. నల్లచట్టం
ఎ. గాంధీ, నెహ్రూ, పటేల్‌
బి. రాజేంద్రప్రసాద్‌, ఎ. వో. హ్యూం, ఉమేష్‌ చంద్రబెనర్జీ
సి. మదన్‌ మోహన్‌ మాలవ్య, మహదేవ్‌ గోవింద్‌ రనాడే
డి. లాలాలజపతిరారు, బాలగంగాధరతిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌
23. గవర్నర్‌ జనరల్‌ ఇన్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ఆఫ్‌స్టేట్‌కి బాధ్యత వహించాలని ఏ చట్టం ద్వారా నిర్దేశించారు?
ఎ. 1773 రెగ్యులేటింగ్‌ చట్టం
బి. పిట్సిండియా చట్టం
సి. 1858 భారత ప్రభుత్వ చట్టం
డి. చార్టర్‌ చట్టం 1853
24. వందేమాతర ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసిపడడానికి తక్షణ కారణం?
ఎ. కాంగ్రెస్‌లో చీలిక బి. హోంరూల్‌ ఉద్యమం
సి. బెంగాల్‌ విభజన డి. బెంగాల్‌ ఏకీకరణ
25. అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌ మొదటిసారి ఎప్పుడు చీలికకు గురైంది?
ఎ. 1905 బి. 1906
సి. 1907 డి. 1908
26. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ ఏ సమావేశంలో చీలికకు గురైంది?
ఎ. ముంబయి బి. బెంగళూర్‌
సి. కలకత్తా డి. సూరత్‌
27. 1907 సూరత్‌ సమావేశంలో చీలికకు గురైన అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌ మళ్లీ ఏ సమావేశం ద్వారా ఏకమైంది?
ఎ. పూణె సమావేశం 1908
బి. కలకత్తా సమావేశం 1909
సి. లక్నో సమావేశం 1916
డి. 1909 అలీఘడ్‌ సమావేశం
28. కాంగ్రెస్‌ సంస్థకు ముస్లింలు క్రమంగా దూరం కావడానికి ముఖ్య కారణం?
ఎ. కాంగ్రెస్‌లో మితవాదుల ప్రాబల్యం పెరగడం
బి. కాంగ్రెస్‌లో అతివాదుల ప్రాబల్యం పెరగడం
సి. కాంగ్రెస్‌లో ప్రజల ప్రాబల్యం పెరగడం
డి. కాంగ్రెస్‌లో నాయకత్వం ప్రాబల్యం పెరగడం
29. ముస్లింలీగ్‌ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ. 1905 డిసెంబర్‌ 30
బి. 1906 డిసెంబర్‌ 30
సి. 1907 డిసెంబర్‌ 30
డి. 1908 డిసెంబర్‌ 30
30. ముస్లిం జనాభాకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు, శాసన మండలాల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని ఏ సమావేశంలో తీర్మానించుకుంది?
ఎ. 1905 బెంగాల్‌ సమావేశం
బి. 1907 సూరత్‌ సమావేశం
సి. 1906 కలకత్తా సమావేశం
డి. 1907 కరాచీలీగ్‌ సమావేశం
31. 1909 చట్టానికి బదులు కొత్తచట్టం రూపొందించాలని ఏ సమావేశంలో తీర్మానించారు?
ఎ. 1913లో జరిగిన లీగ్‌ లక్నో సమావేశం
బి. కరాచీలీగ్‌ సమావేశం 1907
సి. 1916 పూనా సమావేశం
డి. 1916 కాంగ్రెస్‌ లీగ్‌ సమావేశం
32. ఖిలాఫత్‌ ఉద్యమం రూపుదాల్చడానికి తక్షణ కారణం?
ఎ. టర్కీలో ఖలీఫాకు జరిగిన అవమానం
బి. బ్రిటన్‌లో గవర్నర్‌ జనరల్‌కి జరిగిన అవమానం
సి. బ్రిటన్‌ యువరాణికి జరిగిన అవమానం
డి. బ్రిటన్‌ ప్రభుత్వ అధికారులకు జరిగిన అవమానం
33. బెంగాల్‌ పునరేకీకరణ చెందిన సంవత్సరం?
ఎ. 1995 బి. 1915
సి. 1916 డి. 1917
34. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన చట్టం?
ఎ. మింటోమార్లె సంస్కరణలు
బి. మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు
సి. గాంధీ సంస్కరణలు
డి. నెహ్రూ సంస్కరణలు
35. పరిమిత భూసంస్కరణ చట్టం ప్రవేశపెట్టిన గవర్నర్‌ జనరల్‌ ?
ఎ. కారన్‌వాలీస్‌ బి. డల్హౌసి
సి. విన్‌స్టన్‌ చర్చిల్‌ డి. విలియం
36. భారతదేశంలో హోంరూల్‌ ఉద్యమాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు?
ఎ. నెహ్రూ, ఢిల్లీ
బి. సుభాష్‌ చంద్రబోస్‌, కలకత్తా
సి. బిపిన్‌ చంద్రపాల్‌, బెంగాల్‌
డి. బాలగంగాధరతిలక్‌, పూణె
37. బాలగంగాధరతిలక్‌ ఏ సంవత్సరంలో హోంరూల్‌ స్థాపించారు?
ఎ. 1916 ఏప్రిల్‌ 28 బి. 1917 ఏప్రిల్‌ 28
సి. 1918 ఏప్రిల్‌ 28 డి. 1919 ఏప్రిల్‌ 28
38. మద్రాస్‌లో హోంరూల్‌ ఉద్యమాన్ని ఉధృతం చేసింది?
ఎ. బాలగంగాధర్‌తిలక్‌ బి. అనిబిసెంట్‌
సి. లాలాలజపతిరారు డి. సురేంద్రనాథ్‌ బెనర్జి
39. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ప్రత్యక్ష సత్యాగ్రహ ప్రదర్శనలో భాగంగా మర్చిపోలేని దుర్ఘటనగా దేన్ని పేర్కొంటారు?
ఎ. ఖిలాపత్‌ ఉద్యమం
బి. చౌరి చౌరా సంఘటన
సి. సహాయనిరాకరణోద్యమం
డి. జలియన్‌వాలాబాగ్‌ జనహత్య
40. భారతజాతీయోద్యమంలోని ఏ దశను 'గాంధీ దశ ' అంటారు?
ఎ. 1885-1905 మొదటి దశ
బి. 1905-1920 అతివాద దశ
సి. 1920-194 మూడవ దశ
డి. 1947 నుండి 2016 నాల్గవ దశ
సమాధానాలు
1.సి 2. బి 3. డి 4. ఎ 5. సి
6. ఎ 7. డి 8. ఎ 9. బి 10. బి
11. సి 12. ఎ 13. బి 14. సి 15. ఎ
16. బి 17. డి 18. సి 19. బి 20. సి
21. డి 22. బి 23. సి 24. సి 25. సి
26. డి 27. సి 28. బి 29. బి 30. డి
31.ఎ 32. ఎ 33. సి 34. బి 35. ఎ
36. డి 37. ఎ 38. బి 39. డి 40. సి

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...