1. సమాజ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
ఎ. జి.ఎస్. ఘారే బి. అగస్ట్ కాంప్టే
సి. మాక్స్‌లెబర్ డి. కింగ్‌సే
2. భారతీయ సమాజ శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు?
ఎ. ఎం.ఎన్. శ్రీనివాస్ బి. యోగిందర్ యాదవ్
సి. జి.ఎస్. ఘారే డి. సునీత సింగ్
3. సోషియాలజీ శాస్త్రీయంగా అధ్యయనం చేసే అంశం?
ఎ. మానవ జీవనం
బి) మానవ ప్రవర్తన
సి) సమగ్ర చరిత్ర
డి) వ్యక్తుల మధ్యగల సామాజిక సంబంధాలు
4. సామాజిక సంస్థల మనుగడ దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ. పరస్పర ఇష్టత
బి. నిరంతర శ్రమ
సి. ఆర్థిక రాజకీయ అంశాలు
డి. వ్యక్తుల క్రమశిక్షణ
5. జాతీయ మహిళా సాధికారత విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?
1. 2001 బి. 2002
సి. 2003 డి. 2004
6. లింగ, వయస్సు, జాతి, కులం, మతం అనేవి దేనిని సూచిస్తాయి?
ఎ. సాధించిన అంతస్తు
బి) జన్మత: లభించిన అంతస్తు
సి. కుటుంబం అందించిన అంతస్తు
డి) సమాజం అందించిన అంతస్తు
7. వివాహ వ్యవస్థ ఒక
ఎ. సంస్కారం బి. సామాజిక వ్యవస్థ
సి. సామాజిక సంస్థ డి. సాంస్కృతిక వ్యవస్థ
8. కింది వాటిలో ఏది కుటుంబ సంస్థ విధికాదు?
ఎ. సాంఘీకీకరణ బి. సంతానోత్పత్తి
సి. శ్రమవిభజన డి. వర్తక, వ్యాపారం
9. తెగ అనేది దేనికి ఉదాహరణ?
ఎ. వర్గం బి. సామాజిక సమూహం
సి. సముదాయం డి. పైవన్నీ
10. సామాజిక సమస్యలు విసిరే సవాళ్లను ఎదుర్కొనే సమాజిక విధానాలను ఏమంటారు?
ఎ. సామాజిక అభివృద్ధి బి. సాంఘిక సంక్షేమం
సి. సాంస్కృతిక విలంబన డి. సమగ్ర సంక్షేమం
11.ప్రపంచ మంతటా ప్రచారంలో ఉన్న వివాహరూపం?
ఎ. బహు వివాహం బి. బహుభర్తృత్వం
సి. ఏక వివాహం డి. సమూహ వివాహం
12. కన్యాశుల్కం అంటే?
ఎ. వధువు బంధువులు వరుడి బంధువులకు వివాహ సందర్భంగా చేసే చెల్లింపులు.
బి. వరుడి బంధువులు వధువు బంధువులకు చేసే వివాహ చెల్లింపులు.
సి. వధువు బంధువులు పురోహితుడికి చెల్లించేవి.
డి. వధువు బంధువులు తమలో తాము ఇచ్చుకునే బహుమతులు.
13. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువమంది పురుషులను వివాహమడటాన్ని ఏమంటారు?
ఎ. బహు భార్యత్వం బి. ఏక వివాహం
సి. బహుభర్తృత్వం డి. బహు వివాహం
14. మానవ వివాహ చరిత్ర (హిస్టరీ ఆఫ్ హ్యుమన్ మ్యారేజ్) గ్రంథ రచయిత ఎవరు?
ఎ. సర్ హెన్నీ మెయిన్ బి) వెస్టర్ మార్క్ సి) టాల్కాట్ పార్మన్స్ డి) ఎంగెల్స్
15. వివాహం హిందువులలో ఒక ....?
ఎ. ఆచారం బి. ఉత్సవం
సి. ఒప్పందం డి. సంస్థ
16. ముస్లిం పురుషుడు క్రైస్తవ స్త్రీని వివాహమాడితే ఆ వివాహాన్ని ఏమంటారు?
ఎ. ముతా (mute) బి) బాటిల్(batil)
సి. ) సహీనిఖా(ఎవ్a) డి) ఫసీద్ (టవరఱస)
17. హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ. 1955 బి. 1965
సి. 1954 డి. 1961
18. mind self and society అనే ప్రత్యేక గ్రంథాన్ని రాసిన వారు?
ఎ. సిగ్మండ్ ఫ్రాయిడ్ బి. ఎమైల్ డర్క్‌హిమ్
సి. సోరోకిన్ డి. హెర్బర్ట్ మీడ్
19. ఏసియన్ డ్రామా గ్రంథకర్త ఎవరు?
ఎ. నాజర్ బి. లాక్
సి. గున్నార్ మిర్థాల్ డి) మావోసేటుంగ్
20. వేదాలకు తరలి వెళ్లండి(Go back to vedes) అని చెప్పింది?
ఎ. రాజా రామ్మోహన్ రారు
బి. రామకృష్ణ పరమహంస
సి. ఆత్మారాం పాండురంగ
డి. స్వామి దయానంద సరస్వతి
21. ఒక వ్యక్తికి 33 మంది ద్వితీయ బంధువులు, 151 మంది తృతీయ బంధువులు ఉంటారని పేర్కొన్న శాస్త్రవేత్త?
ఎ. ఐరావతి కార్వే బి. టేలర్
సి. రాడ్‌క్లిఫ్ బ్రౌన్ డి. మర్డాక్
22. మాతృ స్వామ్య లక్షణం కానిది ఏది?
ఎ. మాతృ వంశానుక్రమం
బి. మాతృ అధికారం
సి. మాతృ వంశీయ ఆస్తి సంక్రమణ డి. పతిస్థానిక నివాసం
23. భారతీయ కులవిధానం గురించ ప్రస్తావన మొట్టమొదట ఎక్కడ కనిపిస్తుంది?
ఎ. మహాభారతం బి. ఉపనిషత్తులు సి. వేదాలు డి. రామాయణం
24. కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు?
ఎ. సి.హెచ్ కూలే బి. డేవిస్ మూర్ సి. సమ్నర్ డి. మెకైనర్
25. తండ్రి అనే బంధుత్వ పదం ఏ పదానికి చెందింది?
ఎ. కుటుంబ పదం బి. వర్ణనాత్మక బంధుత్వ పదం
సి. వర్గాత్మక బంధుత్వ పదం డి. వ్యుత్పన్న పదం
26. యాజమాన్య వ్యవస్థను తొలిసారి అధ్యయనం చేసిన వారు ఎవరు?
ఎ) చార్లెట్ వైజర్ బి) విలియం వైజర్
సి) ఆస్కార్ లూయిస్ డి) లూయి డ్యూయంట్
27. ఆధిపత్య కుల భావనను రూపొందించిన వారు?
ఎ. ఎస్సీ దూబే బి. ఎ.ఆర్. దేశారు
సి. ఎం.ఎన్. శ్రీనివాస్ డి. యోగేంద్ర సింగ్
28. స్త్రీ తన భర్త సోదరులందరినీ వివాహమాడే పద్ధతిని ఈ పేరుతో పిలుస్తారు?
ఎ. సోదరేతర వివాహం బి. సోదర బహుభార్తృత్వం
సి. బహువివాహం డి. ఏకవివాహం
29. ఆర్య సమాజ, బ్రహ్మ సమాజ ఉద్యమాలు ఏ రకమైన ఉద్యమాలు.
ఎ. విప్లవాత్మక ఉద్యమాలు
బి. ఆదర్శవాద ఉద్యమాలు
సి. సంస్కరణవాద ఉద్యమాలు
డి. భక్తి ఉద్యమాలు
30. సామాజిక ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఎ. సమిష్టి చర్య
బి. సామాజిక పరివర్తన దిశగా పయనించడం
సి. సమిష్టి చర్య సుదీర్ఘకాలం నిలదొక్కుకోవడం
డి. పైవన్నీ
31. మహిళల నాయకత్వంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో చేపట్టారు?
ఎ. కర్నాటక బి. ఆంధ్రప్రదేశ్
సి. మహారాష్ట్ర డి. తమిళనాడు
32. ఒకే దేవుడు, ఒకేమతం, ఒకే కులం, నినాదం ఈ ఉద్యమానికి సంబంధించింది?
ఎ. దళిత ఉద్యమం
బి. యస్.యన్. డి.పి. ఉద్యమం
సి. డి.యం.కె ఉద్యమం
డి. బహుజన సమాజ్ ఉద్యమం
33. ''మహిళలపై హింస వ్యతిరేక దినం'' ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. ఆగస్టు 25 బి. నవంబరు 26
సి. అక్టోబర్ 25 డి. నవంబరు 25
34. వధూవరులు వివాహానంతరం వరుని మేనమామ తో కలిసి నివాసం చేసే పద్ధతిని ఈ పేరుతో పిలుస్తారు?
ఎ. మాతృ స్థానిక బి. మాతుల స్థానిక
సి. పితృ స్థానిక డి. నూతన స్థానిక
35. 'మోర్గాన్' అభిప్రాయం ప్రకారం తొలి మానవుడు పాటించిన వంశానుక్రమం ఏది?
ఎ. మాతృవంశీయ బి. పితృవంశీయ
సి. ద్వివంశీయ డి. ద్వంద్వ
36. ప్రసిద్ధ గ్రంథం అయిన 'భారతదేశంలో సామాజిక ఉద్యమాలు' రచయిత ఎవరు?
ఎ. శ్రీవాస్తవ బి. ఎం.ఎస్.ఎ. రావు
సి. సి. నీలిమా ముఖర్జీ డి. డి. సతీష్ చంద్ర
37. 610 జీవోను జారీ చేసిన సంవత్సరం.
ఎ. 1975 బి. 1980
సి. 1985 డి. 1990
38. 619 జీవో అమలును పరిశీలించుటకు నియమించిన కమిటీ?
ఎ. వాంఛూ కమిటీ బి. శ్రీకృష్ణ కమిటీ
సి. గిర్‌గ్లానీ కమిటీ డి. భార్గవ్ కమిటీ
39. ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ, ఛైర్ పర్సన్ ఎవరు?
ఎ. కైలాష్ సత్యార్థి బి. కుషాల్ సింగ్
సి. అమరేంద్రనాథ్ డి. హేమంతా త్రిపాఠి
40. తెలంగాణ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చిన తేది?
ఎ. సెప్టెంబరు 11, 1947
బి. ఆగస్టు 15, 1947
సి. ఆగస్టు 11, 1917
డి. సెప్టెంబరు 15, 1947
సమాధానాలు:
1. బి 2. సి 3. డి 4. ఎ 5. ఎ
6. బి 7. సి 8. డి 9. సి 10. ఎ
11. సి 12. బి 13. సి 14. బి 15. ఎ
16. ఎ 17. ఎ 18. డి 19.సి 20. డి
21. డి 22.డి 23. సి 24. ఎ 25. సి
26. బి 27. సి 28. బి 29. సి 30. డి
31. బి 32. బి 33. డి 34. బి 35. ఎ
36. బి 37. సి 38. సి 39.బి 40. ఎ
Comments
Post a Comment