Skip to main content

మన రాష్ట్రపతులు - వివరాలు

*మన రాష్ట్రపతుల వివరాలు*:
🌸🐰🌸
1. రాజేంద్ర ప్రసాద్ (బీహార్) - 1951-1962
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దేశానికి స్వతంత్రం వచ్చాక ఆహార మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేశారు,

2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తమిళనాడు) - 1962-1967
ప్రపంచానికి హిందుత్వాన్ని పరిచయం చేసిన గొప్ప తత్వవేత్త. ఏ రాజకీయ పార్టీకి చెందని ఈయన్ని ఉపరాష్ట్రపతిగా, తర్వాత రాష్ట్రపతిగా గౌరవించుకొంది ఆనాటి రాజకీయ వ్యవస్థ. ఈయన పుట్టినరోజునే నేటికీ టీచర్స్ డే గా జరుపుకుంటున్నాం.

3. జాకిర్ హుస్సేన్ (తెలంగాణ) 1967-1969
స్వాతంత్ర పోరాటాం నుండి ఈ దేశంలో విద్యావ్యవస్థని నిలబెట్టటంలో మరీ ముఖ్యంగా దేశ విభజన సమయంలో దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. తర్వాత బీహార్ గవర్నర్ గా, ఉపరాష్ట్రపతిగా ప్రతి పదవిని సమర్ధంగా నిర్వహించారు.

4. వి.వి.గిరి (ఒరిస్సా) 1969-1974
తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వి వి గిరి,  1910 ల్లోనే విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించి, గాంధీ పిలుపిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై మద్రాస్ లో చేస్తున్న లాయర్ వృత్తిని వదులుకొని స్వతంత్ర పోరాటంలోకి వచ్చాడు. ముఖ్యంగా కార్మిక రంగంలో ఆయన చేసిన కృషి మరవలేనిది. పాతపట్నం నియోజకవర్గంలో బొబ్బిలి రాజుల్ని ఓడించి, కార్మిక మంత్రిగా, కేరళ గవర్నర్ గా, ఉపరాష్ట్రపతిగా వివిధ పదవుల్ని నిర్వహించి తర్వాత రాష్ట్రపతి అయ్యారు.

5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్( ఢిల్లీ) 1974-1977
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆ పోరాటంలో జైలు జీవితం అనుభవించినవాడు. అస్సాం నుంచి ఎన్నికలలో గెలుస్తూ పలు ముఖ్యమైన కేంద్ర మంత్రి పదవుల్ని నిర్వహించినవాడు.

6. నీలం సంజీవ రెడ్డి (ఆంధ్ర) 1977-1982
స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, రెండుసార్లు లోకసభ స్పీకర్, కేంద్రమంత్రిగా పలు పదవులు నిర్వహించారు.

7. జైల్ సింగ్ (పంజాబ్) 1982-1987
దేశానికి స్వాతంత్ర సమయంలో ఫరీద్ కోట సంస్థాన రాజరికాన్ని వ్యతిరేకించి అయిదేళ్ల పాటు వారి వల్ల తీవ్ర హింస అనుభవించాడు. తరువాత ఎన్నికలలో గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా, పంజాబ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పని చేశారు.

8. ఆర్. వెంకట్రామన్ (తమిళనాడు) 1987-1992
స్వాతంత్ర ఉద్యమ సమయంలో జైలు జీవితం అనుభవించి, తర్వాత 4 సార్లు ఎం.పి గా గెలిచి దేశ ఆర్ధికశాఖ మంత్రిగా, రక్షణశాఖ మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా వివిధ పదవులు నిర్వహించారు.

9. శంకర్ దయాల్ శర్మ (మధ్యప్రదేశ్) 1992-1997
స్వాతంత్ర సమరయోధుడు. తర్వాత, కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిగా, ఆంధ్ర, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్ గా, ఉపరాష్ట్రపతిగా పలు పదవులు నిర్వహించారు.

10. కే.ఆర్.నారాయణన్ (కేరళ) 1997-2002
కొబ్బరి వలిచే కూలీ కుటుంబంలో అత్యంత పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఇండియాలో ఉన్నత చదువుల అనంతరం, ఇంగ్లాండ్ లో లండన్ అఫ్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో పొలిటికల్ సైన్స్ చదివారు. వివిధ దేశాలకు దౌత్యవేత్తగా పని చేశారు. JNU వైస్ ఛాన్సలర్ గా రిటైర్ అయ్యాక, రాజకీయాల్లోకి వచ్చి వరసగా మూడు సార్లు ఎం పి గా గెలిచి వివిధ మంత్రిత్వ శాఖలు చూసారు. ఉపరాష్ట్రపతిగా పని చేశారు.

11. అబ్దుల్ కలాం(తమిళనాడు) 2002-2007
పేద ఇమామ్ కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకొని, ఒక న్యూక్లియర్, స్పేస్, రక్షణ రంగాలలో పరిశోధకుడిగా ఎదిగి దేశానికి ఎంతో సేవ చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రధానమంత్రి సలహాదారుడిగా, మన దేశం నిర్వహించిన అణుపరీక్షల్లో కీలక పాత్ర వహించారు.

12. ప్రతిభా పాటిల్ (మహారాష్ట్ర) 2007-2012
1934 లో జన్మించి, ఉన్నత విద్యనభ్యసించి, ఒక లాయర్ గా మహిళా సమస్యల మీద పోరాడింది. 27 ఏళ్ల వయసులో ఎం ఎల్ ఏ గా ఎన్నికవడం ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టి, వరసగా నాలుగు సార్లు గెలిచి, తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా,  లోకసభ సభ్యురాలిగా ఎన్నికయ్యి, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించి,  దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ గా  రాజస్తాన్ కి నియమితులయ్యారు.

13. ప్రణబ్ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)  2012-2017
పలుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, లోకసభ సభ్యుడిగా ఎన్నికయి, ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ వరకు అన్ని కాబినెట్లలో ఎన్నో కీలకమైన శాఖలు నిర్వహించారు. ప్రతి శాఖని అద్భుత పనితీరుతో నిర్వహించి తర్వాత ప్రధానమంత్రి ఈయనే అని దేశ ప్రజలు అనుకునే స్థాయికి ఎదిగారు.

14. రామ్ నాథ్ కోవింద (ఉత్తర ప్రదేశ్) 2017 - ?
ఒక రైతు కుటుంబంలో జన్మించి, డిగ్రీ పూర్తి అయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటానికి ఢిల్లీ వచ్చి, రెండు సార్లు తప్పి, మూడోసారి పాసయినా ఐ ఏ స్ కి సెలెక్ట్ కాకపోవటంతో, లాయర్ గా స్థిరపడ్డారు. రాజకీయ పరిచయాలు పెరగటంతో ఒకసారి ఎం పి గా, మరో సారి ఎం ఎల్ ఏ గా పోటీ చేసి ఓడిపోయారు.  రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2015 లో ప్రస్తుత మోడీ ప్రభుత్వం బీహార్ గవర్నర్ గా నియమించింది. ఒక రాష్ట్రం నుండి ప్రధానమంత్రి ఉండగా, అదే రాష్ట్రం నుండి రాష్ట్రపతిని కూడా నియమించటం ఇదే మొదటిసారి.🌀🐰🌀

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...