✅ తెలుసుకుందాం ✅
🌴🎋Trees donot grow on heighest mountains, ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?🌳🌵
✳ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.
Comments
Post a Comment