🔲 సూక్తులు
🔻తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
🔻త్యాగమయ జీవితం మహత్తర జీవితం.
🔻త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.
🔻దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.
🔻దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.
🔻దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.
🔻దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
🔻దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.
🔻దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
🔻దూరపు కొండలు నునుపుగా తోచు.
🔻దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
Comments
Post a Comment