మీకు తెలుసా? సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి భూమిని చేరుతుంది కదా. మరి సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు? సూర్యకాంతి వేడిగా ఎందుకుంటుంది?
*ప్రశ్న:* సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి భూమిని చేరుతుంది కదా. మరి సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు? సూర్యకాంతి వేడిగా ఎందుకుంటుంది?
*జవాబు:* ముందుగా సౌరకాంతి చాలా వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. సౌరగోళం కేంద్రక సంలీన చర్య (nuclear fusion) ల ద్వారా విడుదలయ్యే అత్యధిక శక్తి నిలయం. ఇది ఎంత శక్తి అంటే సౌరగోళం లోపల ఉష్ణోగ్రత కొన్ని లక్షల సెంటీగ్రేడు డిగ్రీలుంటుంది. అలాంటి అగ్ని గోళం నుంచి విడుదలయ్యే కాంతి తీవ్రత చాలా హెచ్చుగా ఉండడం వల్ల మనకు అది వేడిగా అనిపిస్తుంది. కానీ సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది(Absorbed). కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం (Scattering) చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము.
మీరు తరగతిలో ఉపాధ్యాయుణ్ని, నల్లబల్లను చూస్తారు. అక్కడ పడ్డ కాంతినే మీరు చూస్తున్నారు. మనం చూసే అన్ని వస్తువుల నుంచి కాంతి మన కంటిని చేరడం వల్లనే ఆయా వస్తువులను మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ కాంతి వేడిగా ఉండదు కదా! అలాగే చంద్రుడిమీద పడి మనల్ని చేరే సౌరకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వేడిగా అనిపించదు.
Comments
Post a Comment