Skip to main content

బ్యాంకింగ్ రంగం - మైలు రాళ్లు !!


బ్యాంకింగ్ రంగం - మైలురాళ్లు
-1949, జనవరి 1: పార్లమెంటు చట్టం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకును జాతీయం చేశారు.
-1951, సెప్టెంబర్ 4: ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలను తీసుకుని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వ ప్రకటన.
-1955, జూలై 1: ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్పు.
-1956: భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా) జాతీయం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ.
-1964, జూలై 3: భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ (IDBI) ఏర్పాటు.
-1969 జూలై 19: 14 బ్యాంకులను జాతీయం చేశారు. అవి.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
-1973: విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) అమల్లోకి వచ్చింది.
-1978, జనవరి 11: వెయ్యి, 5 వేలు, 10 వేల రూపాలయల నోట్లను చలామణి నుంచి తొలగించారు.
-1980, ఏప్రిల్ 15: ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. అవి.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయా బ్యాంక్.
-1982: నాబార్డ్ (NABARD) ఏర్పాటు.
-1988, జూలై 9: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) ఏర్పాటు.
-1991, నవంబర్: బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై ఎం. నరసింహం కమిటీ మొదటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం మూడేండ్లలో ఎస్‌ఎల్‌ఆర్ 25 శాతానికి తగ్గింపు. నాలుగేండ్లలో సీఆర్‌ఆర్ 10 శాతానికి తగ్గింపు.
-1993, జనవరి: విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టానికి సవరణ. ప్రైవేటు రంగంలో బ్యాంకు ల ఏర్పాటుకు నియమనిబంధనల జారీ.
-1993, సెప్టెంబర్: పంజాబ్ నేషనల్ బ్యాంకు లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం.
-1994, మార్చి: ప్రైవేటు రంగంలో మొదటి బ్యాంకుగా యూటీఐ బ్యాంక్ ఏర్పాటు.
-1996, జూలై: బీమారంగాన్ని ప్రైవేటీకరించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (IRA) ఏర్పాటు.
-1999, నవంబర్ 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో బంగారం డిమాండ్‌ను తట్టుకోవడానికి, బంగారం దిగుమతులను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-2000, అక్టోబర్ 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2000, అక్టోబర్ 21 నుంచి 2000, నవంబర్ 26 వరకు ఇండియా మిలీనియం డిపాజిట్స్ (IMD) పథకాన్ని నిర్వహించింది.
-2002, నవంబర్ 14: కేరళకు చెందిన నెడుంగడి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైంది.
-2003, సెప్టెంబర్: దేశంలోని పెద్ద బ్యాంకులు కలిసి నెలకొల్పిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (అస్సెట్ రీ కనస్ట్రక్షన్ కార్పొరేషన్) పనిచేయడం మొదలైంది. ఆర్థిక సంబంధ ఆస్తుల పునర్నిర్మాణానికి, సెక్యూరిటైజేషన్‌కు అనుమతిచ్చే చట్టాన్ని 2002లోనే ప్రభుత్వం తీసుకురాగా, ఆ చట్టం కింద ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏర్పాటయ్యింది.
-2004: నిరర్థక ఆస్తులను పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నమోదైంది.
-2004, జూలై 26: గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనమైంది.
-2005, జూన్ 4: భారతీయ స్టేట్ బ్యాంక్ 200 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. బ్యాంక్ ద్విశతాబ్ది వేడుకలను ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...