Does Planets have gravitational force to other planets?
ఇతర గ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ఉండదా?
ఇతర గ్రహాలపై గురుత్వాకర్షక శక్తి లేదనుకోవడం సరికాదు. గ్రహమేదైనా ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తి తప్పనిసరి. మన సౌరమండలంలోనే భూమి కన్నా తక్కువ, భూమి కన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తిగల గ్రహాలున్నాయి. సాధారణంగా ఓ గ్రహపు గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహపు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనడం కన్నా గురుత్వాకర్షణ బలం అనడం మరింత శాస్త్రీయం. 205 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఎంత త్వరణం (acceleration)కలిగించే సత్తా ఉందో ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. మన భూమికి ఇది 9.8 న్యూటన్లు కాగా, బుధగ్రహంపై ఇది కేవలం 3.8 న్యూటన్లు మాత్రమే. చంద్రునిపై ఇది సుమారు 1.4 న్యూటన్లు. అయితే మన సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (జ్యూపిటర్)పై ఉండే గురుత్వాకర్షక బలం సుమారు 24.8 న్యూటన్లు. అంటే భూమిపై 100 కిలోల బరువుండే ఒక వస్తువు బృహస్పతిపై సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. అదే వస్తువు చంద్రుడిపై కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటుంది.
Comments
Post a Comment