'మిని రాజ్యాంగం' అని ఏ చట్టాన్ని పిలుస్తారు?
భారత రాజ్యాంగంపై బ్రిటిషు ప్రభుత్వ చట్టాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీటి ప్రభావం వల్ల మన జాతీయోద్యమంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటిషు ప్రభుత్వం రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం- 1773 నుండి భారత స్వాతంత్య్ర చట్టం- 1947 వరకు ఇటు భారతీయుల్లోను, భారత, నూతన రాజ్యాంగ రూపకల్పనలో చాలా ప్రభావం చూపాయి. అందులో *ముఖ్యమైన చట్టాలు.*
ఎ) *రెగ్యులెటింగ్ చట్టం- 1773*:
భారతదేశంలో మొగల్ సామ్రాజ్యానికి విరుద్ధంగా తొలిసారిగా బ్రిటిషు సార్వభౌమత్వాన్ని నిర్ధారించడం వల్ల మన దేశంలో బ్రిటిషు పాలన ప్రారంభం అయ్యింది.
- బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్‌గా పేరు మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్.
- ఈ చట్టం ద్వారా మొదటి సుప్రీం కోర్టును 1774 కలకత్తాలో స్థాపించారు.
బి) *పిట్స్ ఇండియా చట్టం - 1784*: ఈ చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ ఆదిపత్యం సుస్థిరం చేసింది.
సి) *చార్టర్ చట్టం -1793*: లండన్‌లో భారత వ్యవహారా లకు చెందిన బోర్డు ఆఫ్ కంట్రోల్ సభ్యుల జీతాలను ఈస్టిండియా కంపెనీ చెల్లిస్తుంది.
డి) *చార్టర్ చట్టం- 1813:* ఈ చట్టం ద్వారా 20 సంవత్స రాలు ఈస్టిండియా పాలన కొనసాగించారు.
ఇ) *చార్టర్ చట్టం- 1833*: ఇండియన్ గవర్నర్ జనరల్ పేరు మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్.
భారతీయ లా కమిషన్‌ను లార్డు మెకాలె ఏర్పాటు చేసారు.
ఎఫ్) *చార్టర్ చట్టం- 1853*: ఈ చట్టం ద్వారా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.
సిపియస్, ఐపిసి, సిఆర్‌పిసి రూపొందించి 1861 నుంచి అమల్లోకి వచ్చినవి.
*జి) విక్టోరియా రాణి ప్రకటన- 1858*: ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలన అంతమై బ్రిటిషు రాజు లేదా రాణి పరిపాలన ఏర్పడింది.
- గవర్నర్ జనరల్ పేరును వైస్రారు ఆఫ్ ఇండియాగా మార్చారు. ద్వంద పాలన రద్దు.
- బ్రిటిషు రాణి భారత సామ్రాజ్ఞ బిరుదు ధరించింది.
- భారత ప్రజల ఆస్తి, వారసత్వ అధికారాలను రక్షించే భాధ్యతను బ్రిటిషు ప్రభుత్వం స్వీకరించింది.
హెచ్. 1) *1861 భారత కౌన్సిల్ చట్టం:* ఈ చట్టం శాసన నిర్మాణ ప్రక్రియలు మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు.
జె. 2) *1892 భారత కౌన్సిల్ చట్టం:* ఈ చట్టం ద్వారా తొలిసారిగా భారతదేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టారు.
3) *భారత ప్రభుత్వం 1909 (మింటో మార్లే సంస్కరణలు)*:
మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.
కార్యనిర్వాహక మండలిలో మొదటిగా సత్యేంద్రప్రసాద్ సిన్హా (భారతీయులకు) సభ్యత్వం కల్పించారు.
లార్డ్ మింటోను ''మత నియోజక గణాల'' పితామహుడిగా పిలుస్తారు.
ఈ చట్టం హిందు-ముస్లింల మధ్య అడ్డుగోడలు సృష్టించినది అని జవహర్‌లాల్ నెహ్రూ విమర్శ.
4. *భారత ప్రభుత్వ చట్టం- 1919 (మాంటేంగ్- చేమ్స్‌ఫర్డు సంస్కరణలు)*:
మనదేశంలో ద్వంద్వపాలన లెజిస్టేటివ్ అసెంబ్లీ (దిగువ సభ), కౌన్సిలర్ స్టేట్స్(ఎగువసభ)లను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర పాలన అంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డుగా విభజించడం జరిగింది.
5. *భారత ప్రభుత్వ చట్టం-1935, ఆగస్టు-2*: ఈ చట్టంలో 321 అధికరణలు ఉన్నాయి. బ్రిటిషు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ చట్టాలన్నింటిలోను 1935 చట్టం అత్యంత కీలకమైనది.
ద్వంద్వ పాలన రద్దు.
కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాగా అధికారాల విభజన.
భారత్ నుంచి బర్మా (మయన్మార్)ను విడదీయడం.
ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు.
ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏర్పాటు.
ఓటుహక్కు విస్తరణ.
అఖిల భారత సమాఖ్య అనే నూతన వ్యవస్థను ఈ చట్టం ప్రవేశపెట్టింది.
1933లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, బ్రిటిషు ప్రధానమంత్రి రామ్‌సేమెక్‌డొనాల్డ్ జారీ చేసిన కమ్యూనల్ అవార్డులు ఈ చట్టానికి మూలాధారం.
క్రిప్స్ ప్రతిపాదనలు 1942 మార్చి 11న : రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి ఇస్తామని ప్రకటన.
క్యాబినెట్ మిషన్ - 1946 మే 16న: రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవుతుందని ప్రకటన. సెప్టెంబర్ 2, 1946 నెహ్రూ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రకటన.
అట్లి ప్రకటన - 1947 ఫిబ్రవరి 20: బ్రిటన్ కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ వరకు బ్రిటిష్ ప్రభుత్వం భారత్ నుండి వైదొలుగుతుందని ''అట్లి'' ప్రకటించాడు.
బ్రిటిష్ వారు జారీ చేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా గాంధీజీ కొనియాడారు.
భారత స్వాతంత్య్ర చట్టం-
*1947: ఈ చట్టాన్ని 'లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక'* అని కూడా అంటారు. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 5న ఆమోదించింది. బ్రిటిషు రాణి 1947 జూలై 18న సంతకం చేశారు.1947 ఆగస్టు 15 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది.
ఈ చట్టం ద్వారా భారతదేశం విభజించబడి ఇండియా, పాకిస్థాన్‌లు అనే రెండు రెండు స్వతంత్య్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి.
భారత్‌పై బ్రిటిష్ పార్లమెంట్ అధికారం అంతం.
భారత కార్యదర్శి పదవి రద్దు.
భారత్ కామన్‌వెల్త్ నుండి వైదొలిగే స్వేచ్ఛను ఇచ్చారు
Comments
Post a Comment