Skip to main content

పారిస్ ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం - భారత్ పై మరింత భారం మోపిన ట్రంప్ !!


భారత్‌పై మరింత భారం మోపిన ట్రంప్‌


న్యూయార్క్‌: భూతాపోన్నతి ఉద్గారాలను తగ్గించాలనే (క్లైమేట్‌ ఛేంజ్‌) పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ప్రకటించడం భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసే అంశం. దీంతో వేలాది కోట్ల రూపాయల భారం భారత్‌పై పడే ప్రమాదం ఏర్పడింది. అంచనాలకు విరుద్ధంగా జాతీయ వద్ధి రేటు ఈ ఏడాది 7.1 శాతం దాటని పరిస్థితుల్లో ఇది నిజంగా ప్రతికూల పరిణామమే. భారత్‌ లాంటి వర్ధమాన దేశాలు కార్బన ఉద్గారాలను అరికట్టే చర్యలకుగాను అమెరికా లాంటి అభివద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం అందించడం పారిస్‌ ఒప్పందంలో అంతర్భాగం.
దీని కోసం గ్రీన్‌ క్లైమెట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అభివద్ధి చెందిన దేశాలు రెండు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల డాలర్ల వరకు నిధులు చెల్లించాలి. పారిస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ ఒప్పందం కుదిరిన 2015 డిసెంబర్‌ నాటి నుంచి ఏడాదికి వంద కోట్ల డాలర్ల చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తానని అమెరికా, ఇంగ్లండ్, చైనా ఇతర అభివద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి. ఈ హామీలో భాగంగా అమెరికా తొలి విడతగా వంద కోట్ల డాలర్లు, అంటే దాదాపు 6,441 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు విడతలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఒప్పందం నుంచి తప్పుకోవడం భారత్‌ లాంటి వర్ధమాన దేశాలకు భారమే.

భారత్‌పై ఎలా భారం?
పారిస్‌ ఒప్పందం ప్రకారం 2030 నాటికి భారత్‌ తమ కార్బన ఉద్గారాలను 35 శాతం నుంచి 33 శాతానికి తగ్గించాలి. అందుకోసం పునర్వినియోగ ఇంధన వనరులపై దష్టిని పెట్టాలి. 2025 నాటికి 175 గిగావాట్స్‌ ఇంధనాన్ని శిలాజేతర ఇంధనాల (పెట్రోలు, డీజిల్‌ కాకుండా) నుంచి ఉత్పత్తి చేయాలి. బొగ్గు వినియోగాన్ని 20 శాతం తగ్గించాలి. 50 లక్షల హెక్టార్లలో అడవిని పెంచాలి. ఈ చర్యలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వర్థమాన దేశాల్లో కర్బన ఉద్గారాల స్థాయి ఎంత ఉంది ? ఎంత తగ్గించారు? దాని కోసం ఆర్థికంగా ఎంత ఖర్చు అయింది? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రీన్‌ క్లైమెట్‌ ఫండ్‌ నుంచి ‘ఎయిడ్‌’ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు.
ధనిక దేశాలే ఎందుకు భరించాలి?
అభివద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలే నేడు ప్రపంచంలో కాలుష్యం పెరగడానికి కారణం అవడం, ఇప్పటికీ ఆ దేశాలే  ఎక్కువగా కార్బన ఉద్గారాలను వాతావరణంలోకి  వదులుతున్నందున ఆ దేశాల నుంచి గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌ను వసూలు చేయాలని పారిస్‌ ఒప్పందం నిర్ణయించింది. అమెరికా తర్వాత ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతున్న దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. చైనాతోపాటు భారత్‌ కూడా కాలుష్యాన్ని నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాము ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

అసలు పారిస్ ఒప్పందం ఏమిటి?
భూతోపాన్నతి మరో రెండు డిగ్రీల సెల్సియస్‌ పెరిగితో భూగోళంపై ప్రళయ పరిస్థితులు ఏర్పతాయన్నది పరిశోధకుల అంచనా. అంటే మంచు కొండలు, గుట్టలు కరిగిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. పల్లపు ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయి. రుతువులు మారిపోతాయి. ఆహారానికి, నీటికి సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకా ఊహించని పరిస్థితులు సంభవించవచ్చు. అందుకని భూతాపోన్నతి ఎట్టి పరిస్థితుల్లో 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికే పారిస్‌ ఒప్పందం కుదిరింది. ఇందులో అభివద్ధి చెందిన, వర్ధమాన, పేద దేశాల కేటగిరీలుగా లక్ష్యాలను నిర్దేశించారు. దీనిపై 2015, డిసెంబర్‌ 195 దేశాలు సంతకాలు చేశాయి. 2016, అక్టోబర్‌ నెల నుంచి అమల్లోకి వచ్చింది.

ఎవరు నాయకత్వం వహించాలి?
బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి మార్గదర్శకెత్వంలో అమెరికా అమలు చేయాలి. నిజంగా అమెరికా తప్పుకున్నప్పుడు ఎవరు ఈ ఒప్పందాన్ని అమలుచేసే బాధ్యతను స్వీకరిస్తారన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి అమెరికా తర్వాత ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతున్న చైనా నాయకత్వం స్వీకరించాలి. అయితే అందుకు సుముఖత చూపించడం లేదు. భారత్‌ లాంటి వర్ధమాన దేశాలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశాలకు అంత ఆర్థిక సామర్థ్యం లేదు. పైగా మనకు చైనా లాంటి దేశాలతో సఖ్యత లేదు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...