వినూత్న సదుపాయాలతో టి-వాలెట్ !!
- లావాదేవీలపై రుసుము లేదు
- ఎక్కడి నుంచియైన ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చు.
విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటే ఇకపై వరసలో నిల్చోవాల్సిన పని లేదు. సమయం ఏదైనా .. మీరెక్కడున్నా.. బిల్లులు చెల్లించవచ్చు.
స్మార్ట్ ఫోన్ తోనే కాకుండా ... సాధారణ (ఫీచర్) ఫోన్ తో కూడా బ్యాంక్తో సంబంధం లేకుండా డిజిటల్ లావాదేవీలకు వీలు కల్పించే .. అన్నింటినికి మించి ఎలాంటి రుసుము లేని వినూత్న ఫీచర్స్ తో కూడిన టి-వాలెట్ ను తెలంగాణ సర్కారు గురువారం ఆవిష్కరించింది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ వాలెట్ ని ఆవిష్కరించడం ఇదే తొలి సారి. గ్రామీణ ప్రాంతాలలో కూడా వాడకం పెరిగేందుకు తెలుగు, ఉర్దూ భాషలో కూడా దీనిని తీసుకు వచ్చారు.
ఆధార్ కార్డులని పర్యవేక్షించే ఉదాయ్ సంస్థ చైర్మన్ జె. సత్యనారాయణ సమక్షంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ గురువారం హైద్రాబాద్ లో దీనిని ఆవిష్కరించారు.
డౌన్ లోడ్ చేసుకోవటం ఎలా?
గూగుల్ ప్లే స్టోర్ లో 'టి వాలెట్ తెలంగాణ' అని టైప్ చేసి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఫీచర్ ఫోన్ (ఇంటర్నెట్ లేని) వారు ఈ-సేవ - మీ సేవ కేంద్రాల ద్వారా టి-వాలెట్ ను తమ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డెస్క్ టాప్ లో నైతే http://twallet.telangana.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఉపయోగించటం ఎలా?
👍 స్మార్ట్ ఫోన్ వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డులతో , ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మరియు ఫీచర్ ఫోన్ ఉన్న వారు, ఫోన్ లేని వారు మీ సేవా కేంద్రాల ద్వారా టి-వాలెట్ లో డబ్బులు వేసుకోవచ్చు.
👍 ఆర్బీఐ నిబంధనలు ప్రకారం ఇ-కేవైసీ వినియోగదారులయితే టి-వాలెట్ లో గరిష్టంగా ఏ సమయంలో నయినా ఒక లక్ష రూపాయల దాకా వుంచుకోవచ్చు. ఇ-కేవైసీ లేని వారు నెలలో 20 వేల కు మించకూడదు.
టి-వాలెట్ ప్రత్యేకతలు
👍 ప్రజలు ప్రభుత్వానికి బిల్లులు చెల్లించటమే కాకుండా ప్రభుత్వం చెల్లించే ఉపకారవేతనాలు, పింఛన్ల లాంటి వాటిన మున్ముందు టి-వాలెట్ ద్వారానే చెల్లించే వెసులుబాటు.
👍 ఓటిపి (స్మార్ట్ ఫోన్ లకు) , బయోమెట్రిక్-ఆధార్ (ఫీచర్ ఫోన్లు, ఫోన్ లేని వారికి) అనుసంధానం ద్వారా భద్రతకు ఇబ్బంది లేకుండా చూడటం.
వేటికి వాడొచ్చు
☺ ప్రభుత్వ బిల్లులు, ఆస్తిపన్ను, వాణిజ్య అనుమతులు, నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు..తదితరాలు చెల్లించడానికి
☺ ఆర్టీఏ చాలన్లు చెల్లించేందుకు
☺ ఈ-సేవా/మీ సేవాల ద్వారా సేవలకు
☺ మున్ముందు ఫోన్ రిచార్జీలు, బస్ టికెట్స్ తదితరులకు కూడా...
☺ ఉపకార వేతనాలు, పింఛన్లు కూడా వీటి ద్వారానే ప్రభుత్వం చెల్లిస్తుంది..
Comments
Post a Comment