Skip to main content

చరిత్రలో ఈ రోజు/ జూన్ 3


చరిత్రలో ఈ రోజు/జూన్ 3
సంఘటనలు
1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటెన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.
1962: ఫ్రాన్స్ ఓర్లోలో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
1984 : అమృత్ సర్ లో గల శిక్కుల ప్రసిద్ధ దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.
జననాలు
1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త మరియు ప్రముఖ ప్రకృతి ప్రియుడు (మ.1797)
1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.
1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
  1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.
1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.
1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1966: రాధ, భారతీయ సినీనటి.
1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
మరణాలు
1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)
1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)
1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).
2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
                     
                         

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...