నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం..
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★ మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని అంతర్జాతీయ సమాజాన్ని సృష్టించేందుకు గాను ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ఐరాస ప్రకటించింది.
*■ ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను అరికట్టేందుకు బహుళ ప్రయత్నాలు చేస్తోంది. దేశ దేశాల ప్రభుత్వాలను ఈ మహమ్మారి వ్యాప్తి గురించి హెచ్చరిస్తోంది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఏటా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది.ఐరాస సర్వ ప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది.*
*■ ప్రతి ఏటా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలను స్వాధీనపర్చుకుని దేశ దేశాల్లో బహిరంగంగా వాటిని తగులబెట్టడం, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపర్చడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం వంటి చర్యలను పెద్ద ఎత్తున ఐరాస ప్రోత్సహిస్తోంది.*
■ గడచిన ఐదేళ్లలో భారత్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అమితంగా పెరిగిపో యింది. సంపన్న వర్గాల్లో తేరగా వచ్చే ఆదాయం పెరిగిపోవడం దీనికి ఒక ముఖ్య కారణం.
■ మాదక ద్రవ్యాల ముఠాలు 1980లలో విద్యార్థులను తమ ప్రధాన లక్ష్యాలుగా చేసుకునేవి. ఇప్పుడవి ఎగువ మధ్యతరగతి ప్రజలందర్నీ లక్ష్యంగా చేసుకున్నాయి. రసాయనిక పరమైన మందులతో భారతదేశానికి వచ్చి గంజాయి లాంటి వాటిని తిరిగి తీసుకువెళ్లే విదేశీ పర్యాటకుల నుంచి వీటికి ఎక్కువ గిరాకీ లభిస్తోంది. ప్రధానంగా కొకైన్ దక్షిణ అమెరికా నుంచి భారత్‌కు వివిధ మార్గాల ద్వారా తరలి వస్తోంది. భారతదేశపు రేవులలో ఆగివెళ్లే ఓడల ద్వారా, ప్రయాణీకు ల సామాను ద్వారా అది సులభంగా దేశంలో ప్రవేశిస్తోంది.
*■ కుటుంబ విలువలు విచ్ఛిన్నం కావడం, కుతూహలం, పిచ్చెక్కిస్తున్న పోటీ కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరగడానికి మరికొన్ని కారణాలు. భావోద్వేగ సమస్యలు, స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిడులు, చేతిలో డబ్బు బాగా ఆడడం యువకులలో, పెద్దలలో, వృత్తి నిపుణులలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడానికి మరికొన్ని కారణాలు.*
*■ ఈ కొత్త ధోరణికి మహిళలు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు కావడం ఆసక్తిగొలిపే పరిణామం. చాలామంది మోడల్స్ కోక్‌కు అలవాటు పడిపోతున్నారు. దానిని ఒకసారి వాసన చూస్తే ఆకలి నశిస్తుంది. చాలా గంటల పాటు శక్తివంతంగా వుండేటట్లుగా చేస్తుంది. అందుకే అది సన్నబడేందుకు సరికొత్త సాధనంగా అవతరిస్తోంది.ఆహారం ప్రమేయమే లేకుండా, లేదంటే ఆహార ప్రమేయాన్ని బాగా తగ్గించి, పార్టీలను ఎనర్జీ డ్రింకులకు, మాదక ద్రవ్యాలకు పరిమితం చేయడానికి కారణం ఇందులో వెల్లడవుతుం ది. మహిళలు అనేక సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక మార్గంగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు.*
■ అన్నింటినీ మించి మాదకద్రవ్యాల మీద ఆధారపడటం వల్ల జీవ రసాయనికంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతినడం, మందులలోని రసాయనిక పదార్ధాలు నాడీ వ్యవస్థ మీద దాడి చేయడం, తీవ్రమైన ప్రవర్తనలు, కాలక్రమంలో ఆత్మీయులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం జరుగుతాయి. భారతదేశంలో కొకైన్‌పై వ్యసనపడుతున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అధికారులు నిర్ధారిస్తున్నారు.
*■ హెరాయిన్ ,బ్రౌన్ షుగర్,కొకైన్, గంజాయి, మిథైన్ ఎఫిడ్రోన్ లేదా మెఫిడ్రోన్ ,కెటామైన్, ఎఫిడ్రిన్, ఎథాక్వోలోన్, మెథామ్‌ఫెటామైన్ తదితర సింథటిక్ డ్రగ్స్‌ను,ఎల్‌ఎస్డీ (లైసర్జిక్ యాసిడ్ డైథైలామైడ్) మత్తు బిళ్లలను ఏఫిడ్రోన్‌తోపాటు నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలను నిషేధించారు...*
*■ 'కెమెటామైన్' ఈ మత్తుపదార్థం 100 గ్రా ముల విలువ లక్షరూపాయలు ఉంటుందని అంచనా. దీన్ని 1-2 గ్రాములుగా మార్చి విక్రయిస్తే రెండురెట్లు లాభం వస్తుంది. దీన్ని ఏ విధంగా అయినా వాడే అవకాశం ఉండటం.. ఐదారు గంటల పాటు మత్తులో ఉంచటం దీని ప్రత్యేకత అందుకే ఇతర దేశాల్లో ఈ ముడి సరుకుకు విపరీతమైన డిమాండ్. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, గోవా తదితర నగరాలకు ముడిసరుకుగా చేరవేస్తారు. అక్కడ ఈ డ్రగ్‌ను మాత్రలు, ఇంజక్షన్స్, పొడిగా మార్చు తారు.*
■ అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఈ సంవత్సరం ప్రకటించిన ర్యాంకు ల్లో వరుసగా మూడో ఏడాదీ భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత క్రీడా వ్యవస్థ తలదించుకోవాల్సిన గణాంకాలివి.
*■ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 230 మిలియన్ల మంది ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసల య్యారని, 236 రకాల నిషేధిత మాదకద్రవ్యా లు ఉన్నాయని, సంఖ్యను చూస్తుంటే ఏ స్థాయిలో మాదక ద్రవ్యాల ప్రభావం ప్రజలపై పడుతుందో అర్ధమవు తుంది. అక్రమ రవాణా, వాటి వాడకం అరికట్టకపోతే భవిష్యత్‌లో నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.*
★ ఈ సందర్భంగా మాదకద్రవ్యాల బారినపడ బోమని, మానవ ప్రాణాలతో చెలగాటమాడు తున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రతిన చేద్దాం...
🍃🌸🤗🌸🍃
Comments
Post a Comment