పెట్రోల్, డీజిల్... - రోజుకో ధర
ప్రస్తుతం పక్షానికో సారి మారుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా రోజూ మారనున్నాయి. మే 1 నుండి విశాఖపట్నం, పుదుచ్చేర్రి, చండీగఢ్, ఉదయపూర్, జంషెడ్పూర్ లలో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు దేశంలోని మొత్తం 58 వేల పెట్రోల్ బంకులలో దీని అమలుకు సమయత్తమవుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ విపణి లో చమురు ధరలు రెండు వారాల సగటు, డాలరుతో రూపాయి మారకపు విలువలో మార్పులకు అనుగుణంగా ప్రతీ నెలా 1,16 తేదీలలో ధరల్ని సవారిస్తున్నారు. ఈ నెల 16 నుండి ఈ రెండు అంశాల ప్రాతిపదికన రోజూ సవరించనున్నారు. ఐఓసీ, హెచ్ పీ సీ ఎల్, బీ పీ సీ ఎల్ సంస్థలు అనుసరించనున్న చలనశీల ( Dynamic) ధరల విధానంతో నగరానికి, నగరానికి, బంకుకూ, బంకుకూ మధ్య కూడా ధరాలలో స్వల్ప వ్యత్యాసం ఉండనుంది.

Comments
Post a Comment