స్వాతంత్ర్య సమరయోధుడు.. భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రి..
"మొరార్జీ దేశాయి"
■ భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన 'భారత రత్న'నూ, 'నిషానే పాకిస్తాన్' నూ పొందిన ఏకైక భారతీయుడు.
వ్యక్తిగత వివరాలు..
■ మొరార్జీ దేశాయి బాంబే ప్రెసిడెన్సీ లోని Bhadeli (Valsad)లో ఒక Anavil బ్రాహ్మణ కుటుంబం, (ఇప్పుడు గుజరాత్) లో ఫిబ్రవరి 29, 1896 న జన్మించారు. ప్రాథమిక పాఠశాల జీవితం సౌరాష్ట్ర Kundla స్కూల్ లోను, ముంబాయ్ విల్షన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి గుజరాత్ సివిల్ సర్వీస్ లో చేరారు.
■ 1924 లో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ను వదిలి 1930 లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమములో చేరారు.
■ స్వాతంత్ర్య సమరయోధుడుగా చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు.గుజరాత్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడుగా చలామని అయ్యేవారు.
■ 1934 మరియు 1937లో బొంబే ప్రసిడెన్సీ లో రెవిన్యూ, మరియు హోం మినిష్టర్ గా సేవలందించారు.
■ 1952 లో బోంబే స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు.మరాఠి భాషారాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు.
రాజకీయ జీవితమము:
■ కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రుతోను అతని సహచరులతోను విభేదాలుండేవి. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా ..తనను కాదని నెహ్రూ అనుచరుడు లాల్ బహదూర్ శాస్త్రినే ప్రధానమంత్రిని చేసారు.శాస్త్రి మరణాంతరం 1966 లో ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవలసి వచ్చింది.
■ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోరార్జీదేశాయి10సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
■ 1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది.
■ కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్,
జనసంఘ్, సోషలిస్టు పార్టీలు "జనతాపార్టీ" పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్య క్షుడయ్యాడు.
మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకిరాజీనామా చేసి 'డెమొక్రటిక్ కాంగ్రెస్ 'అనేకొత్త పార్టీస్థాపించాడు.జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు . ఫిబ్రవరి16_మార్చి10వ తేదీ మధ్య జరిగిన న్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి ఉపసంహరించుకో బడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
(జ: ఫిబ్రవరి29,1896-మ:ఏప్రిల్10,1995)
Comments
Post a Comment