Skip to main content

Noble Persons in History - బీర్బల్ సహాని


పరిశోధనలే ప్రాణమైన.."బీర్బల్ సహాని" 



■ బీర్బల్ సహాని భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ,జ్యోతిష్య,గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలు న్నారు.అయితే 'పురా వృక్ష శాస్త్ర పరిశోధన' లలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ! 

బాల్యం,విద్యాభ్యాసం..

■బీర్బల్ సహాని 1891సం"నవంబరు 14వ తేదీ పశ్చిమ పంజాబ్ (యిప్పుడు యిది పాకిస్థాన్ లోనిది) రాష్ట్రంలోని షహరాన్ పూర్ జిల్లాలో గల బెహరా పట్టణంలో జన్మించాడు. తండ్రి లాలా రుచిరామ్‌ సహాని రసాయనిక శాస్త్రోధ్యాపకుడు.తల్లిఈశ్వరీదేవి.స్వాతంత్ర్య  సమరయోధులైన మోతీలాల్ నెహ్రూ, గోపాల కృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, మదన మోహన మాలవ్యా వంటి వారు బీర్బల్ సహానీ తండ్రికి ముఖ్య స్నేహితులే.

■ బీర్బల్ సహాని విద్యాభ్యాసం లాహోర్ లోని భారత ప్రభుత్వ విశ్వవిద్యాలయం కళాశాల లో జరిగింది. 1911 సంవత్సరం వరకూ పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నా డు. తండ్రికి బీర్బల్ సహానీ ఐ.ఎ.ఎస్ గానో ఐ.పి.యస్ గానో చూడాలని కోరుకునేవాడు. అయితే బీర్బల్ కు మాత్రం వృక్ష శాస్త్రం మీద, మొక్కలు, వాటి శిలాజాల తీరుతెన్నుల మీద అమితమైన ఆసక్తి ఉండేది.

■ పంజాబ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రత సాధించిన తర్వాత బ్రిటన్ లోని లండన్  యూనివర్సిటీ నుంచి"డాక్టర్ ఆఫ్ సైన్స్" పట్టా ను పొందారు. అది ఆరోజుల్లో కూడా గొప్ప అరుదైన గౌరవం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఒక భారతీయుడు "డాక్టర్ ఆఫ్ సైన్స్" పట్టాను సాధించటం అదే మొదటిసారి. ఆ ఘనత సాధించింది బీర్బల్ సహానీ! బోటనీ ప్రధానాంశంగా బీర్బల్ సహాని సాధించిన ఈ డాక్టరేట్ కు ఎన్.ఆర్.కాశ్యప్, ప్రొఫెసర్ సివార్ట్ వంటి మేదావులు తోడ్పాటు నందించారు. 1936 సంవత్సరంలో బీర్బల్ సహానీ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అయ్యారు.

పరిశోధనలు..
■ 1917లో ప్రొఫెసర్ సివార్డ్ తో కలసి బీర్బల్ సహానీ భారతీయ గోండ్వానా వృక్షాల మీద విస్తృత పరిశోధనలు చేశారు.  బీహార్ రాష్ట్ర రాజమహల్ పర్వత సానువుల్లో పెరిగే వృక్షాలు, మొక్కలు వాటి వైవిధ్యం, వాటికీ ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నదో తరచి తరచి పరిశోధనలు చేశారు.

■ భారతీయ వృక్ష జాతుల మీదే కాక పాశ్చాత్య దేశాల్లో పెరిగే వృక్ష జాతుల లక్షణా లమీద కూడా లోతైన అధ్యయనం చేశారు సహనీ.

■ విలియం సోనియా సేవార్డియానా, రాజ్‌మహాలియా వరోదరా, హోమోగ్జ్రెలాల్ రాజ్ మహాలెన్స్ వంటి శిలాజాతుల గుట్టు విప్పి ప్రపంచానికి పరిచయం చేసింది బీర్బల్ సహానీయే!

■ ప్రాచీన శిలాజ మొక్కల గురించి అధ్యయనం చేసిన ఆయన ఆవిష్కరించిన 'పెంటోగ్జైలియా' అనే 'జిమ్మోస్పెర్మ్‌' శిలాజం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించాయి.

■1920 వ సంవత్సరం శ్రీమతి సావిత్రిసూరి ని పెండ్లాడారు బీర్బల్ సహాని. అటు పిమ్మట భారత్ వచ్చి కాశీ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వృక్షశాస్త్ర విభాగపు అధిపతిగా నియుక్తులయ్యారు బీర్బల్ సహాని.

■ లక్షల సంవత్సరాల క్రితం,. జూరాసిక్ రాక్షసబల్లుల కాలానికి చెందిన ఎన్నో వృక్షశిలాజాలను తన పరిశోధనల ద్వారా నిర్దుష్టంగా లెక్కకట్టి ప్రకటించారు. తన నిరంతర పరిశోధనలతో అనేకానేక శిలాజాలు, మొక్కల యొక్క జీవితకాలాన్ని లెక్కించడమే కాదు, తన గురుత్వంలో శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులచేత దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నో శిలాజాలను సేకరింపజేసి వాటిగుట్టు విప్పారు బీర్బల్ సహాని.

■ సహాని కృషి ఫలితంగా వృక్షజాతుల, శిలాజాల అధ్యయనం కోసం ప్రత్యేక విభాగమే యేర్పడి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగింది. భారతదేశంలోని 'మొట్టమొదటి వృక్ష శాస్త్ర శిలాజ పరిశోధనా కేంద్రం'గా ఏర్పడింది.

భూగర్భ శాస్త్రవేత్త కూడా..
■ ప్రపంచంలోని ప్రఖ్యాత వృక్ష, జంతు శాస్త్రవేత్తలైన ఎ.అర్నార్డ్ వంటి ఎంతో మంది మేధావులతో బీర్బల్ సహానీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.

■ బీర్బల్ సహాని కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. భూగర్భ శాస్త్రవేత్త కూడా. బీర్బల్ అధ్యయనాలు భూమి ఒకప్పుడు ఒకే ఖండంగా ఉందనీ, కాలక్రమేణా రోదసీలో చోటు చేసుకున్న అనేక భౌతిక, రసాయన మార్పుల కారణంగా భూమి మధ్య నీరు ఏర్పడి 5 ఖండాలుగా రూపాంతరం చెందిందనీ చెబుతున్నాయి. ఈ ముక్కలైన ఖండాలు నిరంతరం చలనశీలత కలిగి ఉంటాయని సిద్ధాంతీకరించారు సహాని.

■ భూమి పొరల్లో, వెలుపలా, ఉండే అనేక శిలల వయస్సును కచ్చితంగా లెక్కగట్టడం, ఎలాటి అధునాతన సున్నిత పరికరాల సహాయం లేకుండా కచ్చితంగా కనుగొనడం ఒక్క బీర్బల్ సహానీకే సాధ్యపడింది. 

■ పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని "సాల్ట్‌రేంజ్ శిలల" వయస్సు అప్పటి వరకూ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నట్లు 10 కోట్ల సంవత్సరాలు కాదనీ ఈశిలల వయస్సు 4 లేదా 5 కోట్ల సంవత్సరాల క్రిందవనీ ఆధారాలతో నిరూపించారు.

■ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్న "దెక్కన్ ట్రాప్స్" వయస్సు 65 కోట్ల సంవత్సరాలని కూడా బీర్బల్ సహానీ పరిశోధనలు చెబుతున్నాయి.

కాల నిర్ణయం..న్యూమిన్ మెట్రిక్స్
■ ప్రాచీన నాణేలను పరిశీలించి వాటి కాలనిర్ణయం నిర్దేశించడం సహానీకి కొట్టిన పిండి. 1936 లో నాణేల మీద బీర్బల్ సహానీపరిశోధనలకు గాను న్యూమిన్ మెట్రిక్స్ సొసైటీ ఈయనకు "నెల్సన్ రైట్స్" మెడల్ ను ప్రదానం చేశారు. నాణేలను 'స్టాంపు'లను సేకరించి పరిశోధించడం అంటే బీర్బల్ కు ఎంతో ఆసక్తి.

■బీర్బల్ సహానీ మంచి *'చిత్రకారుడు'* కూడా. మట్టి బొమ్మలను అద్భుత శిల్పాలుగా తీర్చిదిద్దగల దిట్ట.

సత్కారాలు..
■ లండన్ లోని రాయల్ సొసైటీ 1936వ సంవత్సరంలో బీర్బల్ సహానీని ఫెలోఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపికచేసి గౌరవించింది. వృక్ష శాస్త్ర విభాగంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ సాధించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త సహానీ.

■ 1930- 35 సంవత్సరాల కాలానికి పాలియోబోటనీ విభాగానికి ఉపాధ్యక్షునిగా 5వ మరియు 6వ అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశానికి నియమితులయ్యారు బీర్బల్ సహానీ. 1940 సంవత్సరంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించా రు. 1937-39, 1943-44 నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు అధ్యక్షుడయ్యాడు. 1948 వ సంవత్సరంలో బీర్బల్ సహానీకి అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సభ్యత్వం లభించింది.

పెలనో బోటనీ ఇనిస్టిట్యూట్...
■ బీర్బల్ సహాని మార్గదర్శకత్వంలో లక్నో  పట్టణంలో "పేలనీ బోటనీ ఇనిస్టిట్యూట్" భారతదేశంలో మొట్టమొదటి పురావృక్షశాస్త్ర ప్రయోగశాల నెలకొల్పడానికి ప్రతిపాదనలౌ వచ్చాయి. లక్నో విశ్వవిద్యాలయ ప్రాంగణం లో యిందుకోసం నూతన భవన నిర్మాణానికి 1949 ఏప్రిల్ 3 వ తేదీన అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థా పన చేశరు. బీర్బల్ సహానీ తన కలల సౌధం సాకారం దాల్చుతోందన్న ఆనంద్ంలో తలమునకలయ్యారు. సహ శాస్త్రవేత్తలూ, విద్యార్థులూ, యువ శాస్త్రవేత్తలందరూ ఈ శుభతరుణం కోసం ఎన్నేళ్ళనుండో వేచి ఉన్నారు. వారికి స్వప్నాలు నిజమయ్యే శుభఘడియలు వచ్చేశాయి.

■ సహాని ఆయన కలల సౌధాన్ని కనులారా చూడకుండానే, ఆయనకు వరించిన అంతర్జా తీయ వృక్ష శాస్త్ర కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిని అలంకరించకుండానే, పెలనోబోటనీ ఇనిస్టి ట్యూట్ భవనానికి శంకుస్థాపన జరిగిన వారం తిరక్కుండానే 1949, ఏప్రిల్ 10 న ఆకశ్మిక గుండె పోటుతో మరణించారు.

(జ:నవంబరు14,1891-మ:ఏప్రిల్10,1949)

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...