రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 175 అసెంబ్లీ సీట్లతో పాటుగా ఇప్పుడు మరో 50 అసెంబ్లీ స్థానాలు అదనంగా రానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ సీట్ల వివరాలు ఇవి..
★ అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ కడప జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 19 అసెంబ్లీ సీట్లకు మరో 6 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న 17 అసెంబ్లీ సీట్లకు మరో 5 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న 16 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ కర్నూల్ జిల్లాలో ఇప్పుడున్న 14 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న 12 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 4 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న 10 అసెంబ్లీ సీట్లకు మరో 3 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ విజయనగరంజిల్లాలో ఇప్పుడున్న 9 అసెంబ్లీ సీట్లకు మరో 2 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
★ విశాఖపట్టణంజిల్లాలో ఇప్పుడున్న 15 అసెంబ్లీ సీట్లకు మరో 5 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి.
అయితే దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పెరిగిన అసెంబ్లీ సీట్ల పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వెలువడే దాకా వేచిచూడాల్సిందే...
Comments
Post a Comment