☀ సిద్ధపురుషులకు మరియు సామాన్యులకు వ్యత్యాసం ☀
☘ అది ప్రభాత వేళ ,బాల భానుడు సర్వ ప్రాణికోటికి అభయాన్నిస్తూ ఉదయిస్తున్న వేళ , గురువుగారి దర్శనానికి శిష్యులందరు ఆత్రంగా ఎదురుచుస్తున్న వేళ , కోటిసూర్య తేజోవిరాజితోడైన గురుదేవులు శిష్యులనుద్దరించుటకు గురుకులానికి రానే వచ్చాడు , అందరు శిష్యులు ఆయొక్క 'జ్ఞానమూర్తికి' నమస్కరించి గురుబోధను వినుటకు సిద్ధమయ్యారు ....
☘ అంతట , తొలకరి చినుకుకోసం ఎదురుచుస్తున్న కరువునేలలా ,సందేహ నివృత్తికోసం ఎదురుచూస్తున్న శిష్యుడిని చూసి ,,,,
🌻 గురువుగారు శిష్యుడితో : - నాయనా ....!!!! ఏమి నీ విచారం ...????
🌻 శిష్యుడు :- తండ్రీ ....!!! మానవుల్లో సామాన్యులెవరో ,సాధకులెవరో గుర్తెరుగలేక సతమతమవుతున్నాను , మీరే నాకు దిక్కు ....
🌻 గురువు :- సరే , అలావెళ్లి ఒక పెద్ద గాజు తొట్టినిండా నీరు నింపుకొని తీసుకురా ....
🌻 శిష్యుడు :- తెచ్చానండి ....
🌻 గురువు :- ఇప్పుడు చిన్న చిన్న డబ్బాలలో నీళ్లు నింపి మూత గట్టిగా బిగించి , ఆ డబ్బాలను తొట్టిలో వేయి ...
🌻శి : వేసానండి ....
🌻 గు : ఏమి గమనించావు ....????
🌻 శి : అన్నీ డబ్బాలు నీటిపై తేలుతున్నాయి ....
🌻గురువు : అలా తేలుతున్న డబ్బాలే సామాన్యులు , ఇప్పుడు కొన్ని డబ్బాలకు అడుగునా మరియు పైన సూదితో రంధ్రాలు చేసి మళ్ళీ నీటిలో వేసి ఏమి గమనించావో చెప్పు ....????
🌻శిష్య : పైన, క్రింద రంధ్రాలు చేయబడ్డ డబ్బాలు నిశ్చలంగా నీటి అడుగున చేరి స్థిరంగా వున్నాయి , మిగతావి మాత్రం అలాగే ఇష్టం వచ్చినట్లు నీటిపై తేలుతూ ఉన్నాయి ...
🌻గురువు :- ఈ రెండురకాల డబ్బాల మధ్య గల తేడాయే సామాన్యులకి ,సాధకులకు గల తేడా .....
🌻శిష్యుడు :- అర్థంకాని ఆశ్చర్యకరమైన ముఖంతో అలానే ఉండిపోయాడు ....!!!!
🌻🌻🌻 గురుబోధ :-
నాయనా ...!!! * తేలియాడుతున్న డబ్బాలు మనుషులు ,అందులోని నీరు జీవాత్మ ,
* గాజుతొట్టి సమస్త విశ్వం , అందులోని నీరు పరమత్మ .
☀ 1)తేలియాడుతున్న డబ్బాలలోఉన్న నీటికి తొట్టిలో నీటికి సంబంధం లేదుకాబట్టే అవి క్రమశిక్షణారాహిత్యంగా తెలుతున్నాయి ,అనగా మనషిలోని జీవాత్మ విశ్వంలోనీ పరమాత్మ ఐక్యం కానివారు సామాన్యులు,అధర్మంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు ....
☀ 2) ఎప్పుడైతే డబ్బాలకు క్రిందా,మీదా రంధ్రాలు చేసావో అప్పుడు డబ్బాలోని నీరు తొట్టిలోని నీరు ఐక్యమయ్యి డబ్బాలు స్థిరంగా అడుగున చేరాయి . అనగా ఏ మనిషికైతే తన నిరంతర సాధన వల్ల
క్రింద 'మూలాధారం' పైన 'సహస్రారం' విచ్చుకోబడి తనలోఉన్న జీవాత్మ , విశ్వంలో ఉన్న పరమాత్మతో ఐక్యమవుతుందో వారే "సిద్ద పురుషులు" ఆయొక్క స్థితియే "అహం బ్రహ్మా2స్మి " అదే అద్వైత సిద్ధి ....
🌻శిష్యుడు : అమితానందంతో ....!!! గురుపాదాల చెంతకు చేరాడు,జ్ఞానసిద్ధిని పొందాడు , ధన్యుడయ్యాడు ......
Comments
Post a Comment