Skip to main content

Noble Persons in History - అహల్యా బాయి హోల్కర్

మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి "అహల్యా బాయి హోల్కర్"



"రాజమాత అహల్యాబాయి తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు"

◆ అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు.  తర్వాత,మామ కూడా మరణించారు.  ఒక సంవత్సరం గడిచాకా ఆమె మాల్వా రాజ్యపు  రాణిగా సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె రాజ్యాన్ని థగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు.

◆ రాణీ అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మించి ప్రసిద్ధికెక్కారు. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున ద్వారక  (గుజరాత్) నుంచి మొదలుకొని వారణాసి,  ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారు.  సోమనాథ్‌లో పాడుబడి, అపవిత్రమైవున్న సుప్రఖ్యాత సోమనాథేశ్వరా లయాన్ని ఆమె పునర్నిర్మించారు.

🍥జీవిత విశేషాలు..

■ అహల్యా బాయి హోల్కర్,1725 వ సం" ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామ పెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగింది.ఈ సమయంలో ఇండోర్  పాలకుడిగా మరాఠా సర్దార్లలో ప్రముఖుడిగా మల్హర్ రావ్ వెలుగొందుతున్నాడు. 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు మృతిచెందాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.ఆయన అహల్యా బాయికి యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపా లన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్ మరియు 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడం తో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు.

🍥పరిపాలన..

■ ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతర మం చెప్పినప్పటికీ,నాటి పీష్వా మాధవరావు  అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు ఆమె ఇండోర్  రాజ్యాన్ని పరిపాలించారు.

◆ ఆమె పర్దా పధ్ధతిని (ఘోషా) పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. తుకోజీ హొల్కర్ ను సుబేదార్ గా నియమిం చారు. సామంత నాయకులు ఆమెకెంతో గౌరవమిచ్చేవారు.  

◆ ఇండోర్ ని విస్తరింపచేశారు. రాజధానిని నర్మదా నది ఒడ్డున కొత్తగా నిర్మించిన మహేశ్వర్ కి మార్చారు. మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు.

◆ యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు.

◆ వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు.

◆కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు.

🍥సేవ, హిందూ ధర్మ పరిరక్షణ..

■ పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలి చారు. ఆమె శివుని భక్తురాలు.మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమం తటా శివాలయాలు నిర్మించారు. మహమ్మ దీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు.కాశీ,ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రా లలోని అలయాలను పునరుధ్ధ్రించారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు.

■మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చారు. ఈనాటికీ  మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ది.

🍥గుర్తింపు..

◆ భారతదేశ సంస్కృతికి వీరు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వీరి పేరిట స్త్రీ 'శక్తి పురస్కారాన్ని ' నెలకొల్పారు.
◆ ఇండోర్లోని విమానాశ్రయానికి దేవిఅహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు. 

★ అహల్యాబాయి జీవితాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలగా మలచగా 1958 నాటి ఎస్సెస్సెల్సీ విద్యార్థులకు ఉపవాచకంగా ఆ చారిత్రిక నవలను సంక్షిప్తీకరించారు. 

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...