Skip to main content

గుండె గుట్టు విప్పిన - విలియం హార్వే


👨🏻‍⚕💞🔬➖➖➖➖➖➖➖➖
*గుండె గుట్టు విప్పిన..'విలియం హార్వే 
➖➖➖➖➖➖➖➖➖🌸🌸
*◆ శరీర నిర్మాణం గురించి, ముఖ్యంగా గుండె నిర్మాణం, పనిచేసే విధానం, గురించి 16వ శతాబ్దంలో అనేక పరిశోధనలు జరిగాయి. అయితే గుండె గురిం చి తెలుసుకునేందుకు దేవుడు కొక్కడికే సామర్థ్యం ఉందనీ, మానవులకు దాని గురించి తెలి యదనీ భావించేవారు.*

*◆ పైగా శరీరాన్ని కోసి గుండెను తీసి దాన్ని గురించి అధ్యయనం చేయడం పాప కార్యంగా భావించేవారు. అలా చేయడం అప్పటి రాజుల దృష్టిలో నేరం కూడా. అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యవస్థ నుంచి బయటపడి, అర్ధరాత్రి పూట శ్మశానాల నుంచి శవాలను దొంగిలించి, వాటిని కోసి గుండెకు సంబంధించి న పూర్తి సమాచారాన్ని మిగతా జంతువుల గుండెలతో పోల్చి, శాస్త్రబద్ధంగా వివరించిన ఘనత విలియం హార్వేకు దక్కుతుంది.*

*◆ విలియం హార్వే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా కాలం క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు.*

*💞బాల్యం,విద్యాభ్యాసం*

◆విలియంహార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 
1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు.అచట పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు. అక్కడ హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యరికం పుచ్చుకున్నాడు. 1602 లో వైద్య శాస్త్రంలో పట్టా పుచ్చుకొనట మే కాకుండా ప్రత్యేకమైన యోగ్యతా పత్రాన్ని పొందగలిగాడు. 

*◆ అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితు డయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నుడెవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోడానికి పరిశోధకుడిగా మారాడు. గుండెకు సంబంధిం చిన సందేహాలు మాత్రం ఆయనను వదలలేదు. గుండె నుండి బయలుదేరిన రక్తం రక్త నాళాలలో అటూ ఇటూ ప్రవహించి చివరికి హరించుకు పోతుందే తప్ప మళ్లీ గుండెను చేరదు అనే వాదంలో నిజం ఉన్నట్లు హార్వేకు తోచలేదు. పెద్ద పెద్ద సిరలలో కవాటాలు ఎందుకు ఉంటాయనే తపన కూడా ఈయనలో బయలుదేరింది.*

*💞పరిశోధనలు..*

◆1615లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో ఈయన లెక్చరర్ గా నియమింపబడ్డారు.  చేపలు, కప్పలు,కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేయసాగాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్తనాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండెకొట్టుకోవడమే  అని రుజువు చేశాడు.  

 *◆ గుండెలో నాలుగు గదులు ఉంటాయని, ధమనుల ద్వారా గుండె లోని రక్తం బయటికి పంప్ చేయబడుతుందని, సిరల ద్వారా కవాటాలు రక్తాన్ని గుండె వైపుకి వెళ్ళనిస్తాయే కాని గుండె లోంచి రక్తాన్ని వెలుపలికి రానివ్వవని తెలుసుకున్నాడు.*  

*◆ ఒక అర గంటలో శరీరంలో ఉన్న మొత్తం రక్తం గుండె నుండి వెలువడే రక్తమే ఎక్కువగా ఉంటుందని నాడీ వేగం, గుండె స్పందించే రేటు ఆధారంగా నిర్ధారించుకోగలిగాడు.*

*◆ మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి..గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు.*

*◆ చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగు నా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపు లాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారం లో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు.*

*◆ రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు.*

*◆ మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు.*

*◆ తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.*

*💞గ్రంధములు..*

◆ క్రీ.శ 1628 లో హార్వే ప్రచురించిన"అనటా మికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ " అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను మళ్ళీ పరిశోధనల ద్వారానే రూఢి పరచాలనే శాస్త్రవాది హార్వే. ఈ పుస్తకం ప్రచురించిన మూడు సంవత్సరాల తరువాత హార్వే మొదటి చార్లెస్ మహారాజు కు రాజ వైద్యునిగా నియమించబడ్డాడు. కానీ రాజకీయ విపరిణామాల కారణంగా హార్వే  లండన్ విడిచి పెట్టవలసి వచ్చింది. అప్పుడే కొంతమంది దుండగులు హార్వే ఇంటిలో లేని సమయం చూచి ఆయన నాలుగు దశాబ్దాలు గా సేకరించిన దాచుకున్న అమూల్యమైన విజ్ఞాన సంపద నంతా నాశనం చేశారు.

 ● అయినా హార్వే బాధ పడలేదు. నిరాశతో క్రుంగిపోలేదు. ప్రత్యుత్పత్తి, పిండాభివృద్ధి అంశాల మీద జీవితమంతా పరిశోధించాడు.

*◆1651 లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్"అనే పుస్తకాన్నిప్రచురించాడు. ఈ పుస్తకం ప్రతులు అతి త్వరితగతిలో అమ్ముడైపోయి కొత్త చరిత్రను సృష్టించాయి.*

*💞అస్తమయం..*

◆ హార్వే 1657 సంవత్సరం జూన్ 3 న మరణించాడు. ఈయన ప్రయోగాల ద్వారా రాబట్టిన ఫలితాలే ఈ వేళ కూడా రోగ నిర్ణ యం చేయటానికి ఉపయోగపడుతున్నాయి.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...