శ్వాస క్రియ
ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.
వయసు :- నిమిషానికి శ్వాసక్రియా రేటు
* అప్పుడే పుట్టిన పిల్లలు :- 32 సార్లు
* 5 ఏళ్ల పిల్లలు :- 26 సార్లు
* 25 ఏళ్ల వారు :- 15 సార్లు
* 50 ఏళ్ల వారు :- 18 సార్లు
* ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
* శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
* శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
* మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
* మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
* వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
* అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.
Comments
Post a Comment