Skip to main content

ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు:

ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు: 

1. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే  దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి. ఆ వేసిన డబ్బుని దేవాదాయశాఖ VIP విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది. ఇది జగమెరిగిన సత్యం.

ఇష్టం ఉంటే పదో పరకో పూజారికి ఇవ్వండి.
ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి. ఇలా చేస్తే కొన్నేళ్ళకి దేవాదాయశాఖ ఆదాయం లేని దేవాలయాలను వదిలి పారిపోతుంది. మనకి పట్టిన దరిద్రం  వదులుతుంది.

ప్రైవేట్ గా  భక్తులకమిటీలు బాగా  నడిపే వాటిలో కానుకలు వేయండి.

2.చక్కగా దేవీ దేవతలను దర్శనం చేసుకోండి. భక్తిని ప్రదర్శించండి.

కానీ కొబ్బరికాయలు కొనకండి.

 ఎందుకంటే గుడిలో వాటిని  పూజారి కొట్టటం నైవేద్యం పెట్టటం ఉండవు. వాటిని ఎవరో కాంట్రాక్టర్ పెట్టిన మనిషి కొడతాడు + అమ్ముకుంటాడు.

3. పసుపు,కుంకుమ,అగరత్తులు, హారతి కర్పూరం మీరు తీసుకుని వెళ్తారు. వాళ్లు మళ్ళీ అవే మనకి అమ్ముతారు. ఇతర భక్తు రాళ్ళ పాదాలకు పసుపు రాయండి.అమ్మ వారికి పెడుతున్నాము అనుకుని వారికి భక్తితో గౌరవించి నమస్కారము చేయండి. 

దేవాలయం ఆదాయంతో మీకు కనీసం ప్రసాదం కూడా  పెట్టరు.

4. చీరేలు ,రెవికల గుడ్డలు అమ్మవారికి మొక్కు తీర్చుకోండి, కానీ వాటిని మరల మీరు తీసుకోండి లేదా వాటి అవసరం ఉన్న వాళ్ళకి  దానంగా ఇవ్వండి.
అమ్మవారు సంతోషించి మిమ్ములను ఆశీర్వాది స్తుంది

వేలమువేసి అమ్ముకుని డబ్బు చేసుకునే పాపంలో పాలు పంచు కోకండి !!

5. అన్నదానం ఉన్న చోట  అన్నదానానికి డబ్బు  కట్టండి.ఏదో కొంతలో కొంత నయం పుణ్యం వస్తుంది.

లేదంటే మీ ఇంటిలో నైవేద్యం తయారు చేసుకుని వెళ్ళండి.దేవి దేవతలకి భక్తితో వాటిని వారికి చూపించండి.వాటిని చక్కగా మీరే భక్తులకి పంచిపెట్టండి.అలాగే ఆకలితో అలమటిన్చే అన్నార్తులు దేవాలయం బయట ఉంటారు వారి కడుపు ఆకలి తీర్చేప్రయత్నం చేయండి.

6.  ఇంకా దానం చేయాలి అని అనిపిస్తే గోశాలలలోని గోవులకి ఆహారం కొని తీసుకుని వెళ్ళి ఇవండీ.మీ వంశము తరిస్తున్ది.మీ పెద్దలు ఆశీర్వాదిస్తారు.

7. శ్రీ రామ నవమి,వినాయక చవితి పందిళ్లు వేసేమంచి వారికి చందాలు కొద్దిగా ఇవ్వండి. నైవేద్యాలు ఇళ్ళలో చేసి ఇవ్వండి లేదా పళ్ళు ఫలహారాలు పంచి పెట్టండి లేదా అన్నదానాలు చేయండి. ఏవైనా మీరు ప్రత్యక్షంగా చూసి,పాల్గొనండి.
 
చివరి పలుకు:
ఆదాయం వచ్చే చిన్న చిన్న  ఆలయాలు, పెద్ద పెద్ద దేవాలయ కమిటీలు అన్నీ ఆయా రాజకీయ  పార్టీల వాళ్ళతో, వాళ్ళకిష్టమైన వాళ్ళతో నింపుతున్నారు. 
మసీదులకి,చర్చిలకి  కమిటీలు ప్రభుత్వం ఇలా నియమిస్తారా ? చస్తే చేయరు. అందుకని ఈ దొంగ  సెక్యులర్ ప్రభుత్వం  వారు నిర్వహించే దేవాలయాల లో డబ్బులు వేయవద్దు.  

ముల్లాలకి ,మౌల్వీలకి ముత్తావలీలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. మక్కా హజ్ యాత్రలకి ,క్రైస్తవులకి జెరూసలెమ్ యాత్రలకి,మసీదులు ,చర్చిలు కట్టుకోవటానికి  ప్రభుత్వం మనం కట్టే పన్ను  డబ్బుతోకట్టిస్తారు, యాత్రలకు  పంపుతారు.మనకి మానస సరోవర్ యాత్రకి మనల్ని పంపుతారా ?పంపరు.

మన డబ్బు, మన దేవాలయం , మన దేవుడు,మన పెత్తనం,మన భక్తి ,మన ఆనందం.మన దేవాలయ ఆస్తులు మనం కాపాడు కోవాలి. మన పీఠాధిపతులు, మన మఠాధి పతులు, ఆచార్యులు ,మన భక్తులు నడిపేదాకా మనం ప్రభుత్వా ధీన దేవాలయాలలో డబ్బులు వేయకుండా వాటికి స్వతంత్రం వచ్చేదాకా దీనిని పాటిద్దామని ప్రతిజ్ఞ చేద్దాము.
జైహింద్

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...