1. జత్రోప కాండ భాగం నుండి --------తయారు చేస్తారు?
జ. బయో డీజిల్
2. బీడు భూములలో పెంచుటకు అనువైన మొక్క ఏది?
జ. గ్లైరిసీడియా
3. తరిగిపోని వనరులకు ఉదాహరణలు ఏవి?
జ. గాలి. నీరు. నేల
4. ప్రపంచంలో విడుదల అయ్యే హరిత వాయువులలో ఎంత శాతం అడవులు నరకడం వలన విడుదల అవుతాయి?
జ. 15 శాతం
5. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
జ. 1972
6. జీవవిధానం వలన నాశనం చేయగల పదార్థాలను ఏమంటారు?
జ. బయోడీగ్రేడబుల్ పదార్థాలు
7. పర్యావరణ సమస్యలకు సులువైన పరిష్కారం ఏమిటి?
జ. చెట్లను పెంచడం
8. గంటల కొలది కంప్యూటర్, ఫోన్ లాంటివి ఉపయోగించేవారు -------- కు గురి అవుతారు?
జ. రేడియేషన్
9. గాలి లోని ఘాన రూప మరియు ద్రవ రూప రేణువులను ఏమంటారు?
జ. ఏరోసోల్స్
10. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
జ. జీన్ బాప్టిస్ట్ ఫారియర్
11. వాతావరణంలోనికి ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు చేరితే ------ కు దారి తీస్తుంది.
జ. గ్లోబల్ వార్మింగ్
12. భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఉండుటకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఏది?
జ. ఇంకుడు గుంతలు
13. జీవ ఇంధన ఉత్పత్తికి --------- మొక్కను ఉపయోగిస్తారు
జ. జత్రోప
14. ఆహారపు గోలుసులో కాలుష్యాలు చేరడాన్ని ఏమంటారు?
జ. జైవిక వ్యవస్థాపనం
15. జీవ పరిణామంలో అకస్మాత్తుగా కలిగే మార్పును ఏమంటారు?
జ. ఉత్పరివర్తనం
16. శిలాజాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
జ. పురాజీవ శాస్త్రం
17. తిమింగళం వాజాలు, గబ్బిలంలో రెక్కలు, చిరుతలో కాళ్ళు ఎటువంటి అవయవాలు?
జ. నిర్మాణ సామ్య అవయవాలు
18. శిలాజాల వయసును నిర్ధారించే పద్ధతి ఏది?
జ. కార్బన్ డేటింగ్
19. జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ. మాల్తస్
20. నడిచే అవశేషావయవాల మ్యూజియం అని ఎవరిని అంటారు?
జ. మానవుడిని
Comments
Post a Comment