Skip to main content

*ఆధార్‌ కార్డుకు తాళం*

*ఆధార్‌ కార్డుకు తాళం*

బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవచ్చుఅవసరమైనప్పుడు అన్‌లాకింగ్‌ సదుపాయమూసమాచార భద్రత కోసం తప్పనిసరి

కొత్తగా సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్‌లో ఖాతా తెరవాలన్నా.. అన్నింటికీ ఆధార్‌ కార్డే ఆధారం అయిపోయింది. కొన్ని రకాల డిజిటల్‌ చెల్లింపులకు కూడా ఆధార్‌ కార్డు ఉపయోగిస్తున్నాం. అలాంటప్పుడు పీఓఎస్‌ మిషన్ల వద్ద మన వేలి ముద్ర ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని సులభంగా హ్యాక్‌ చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు, వేలిముద్రల వివరాల ను కూడా సులభంగా భద్రపరుచుకోవచ్చు. కానీ ఆధార్‌తోనే వెరిఫికేషన్‌ ఉంటుందని చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా మన వివరాలు వాళ్లకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు.. సింపుల్‌గా యూఐడీఐఏ డేటాబే్‌స లో మన వివరాలకు తాళం వేసుకోవడమే. ఇలా ఆధార్‌ వివరాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్‌ చేసుకోడానికి, ఆ తర్వాత మనం కావాలనుకున్నప్పుడు అన్‌లాక్‌ చేయడానికి వీలుంది. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లోనే చేసేసుకునే అవకాశాన్ని మనకు యూఐడీఏఐ కల్పిస్తోంది. ఎప్పుడైనా చెల్లింపులు చేయాలన్నా కూడా దా న్ని అన్‌లాక్‌ చేయనవసరం లేకుండా ఫోన్‌కు ఓటీపీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అది కూడా వద్దంటే మాత్రం ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అనే సందేశం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల లాక్‌ చేసుకున్నప్పుడు మాత్రం ఆ విషయాన్ని తెలియజేసి, ఓటీపీ పంపమని అడగచ్చు. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే చెల్లింపులు పూర్తవుతాయి. 

లాక్‌ చేయడం ఎలా? 
*ఆధార్‌కార్డును లాక్‌ చేయడానికి  దిగువ సూచనలు పాటిస్తే చాలు..*
1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. 
2. అందులో ఆధార్‌ సర్వీసెస్‌ అనే విభాగంలో.. ‘లాక్‌/అన్‌లాక్‌ బయోమెట్రిక్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
3. తర్వాత వచ్చే విండోలో మీ 12 అంకెల ఆధార్‌ కార్డు నంబరు ఎంటర్‌ చేయాలి. 
4. తర్వాతి బాక్స్‌లో సెక్యూరిటీ కోడ్‌ (కాప్చా) ఎంటర్‌ చేయాలి. 
5. జనరేట్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 
6. అప్పుడు.. ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ ఎస్సెమ్మెస్‌ వస్తుంది. ఆ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేసి వెరిఫై బటన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత వచ్చే విండోలో ‘ఎనేబుల్‌’ బటన్‌ క్లిక్‌ చేస్తే చాలు. మీ ఆధార్‌ సమాచారం లాక్‌ అయినట్టే. 
7. అన్‌లాక్‌ చేయాలనుకుంటే.. మళ్లీ ఇదే పద్ధతిలోలో వెళ్లి డిజేబుల్‌ లేదా అన్‌లాక్‌ చేస్తే సరిపోతుంది. 

*షేర్‌ చేయొద్దు.. మీ ఆధార్‌ వివరాలు వేరెవరికీ షేర్‌ చేయవద్దని చెప్పే హక్కు కూడా మీకుంది. అయితే అందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడ బయోమెట్రిక్‌ ఆధారంగా లాగిన్‌ అయి మీ వివరాలను ఇతరులతో షేర్‌ చేసుకోవడానికి గతంలో ఆమో దం తెలిపి ఉంటే.. ఆ బాక్స్‌ను అన్‌ టిక్‌ చేయించవచ్చు.*

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...