Skip to main content

Noble Persons in History - దువ్వూరి సుబ్బమ్మ

సమాజసేవిక...దేశ బాంధవి.. స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ 'దువ్వూరి సుబ్బమ్మ వర్దంతి.






★ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ  స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ.

■సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించింది. 

■ ఈమె భర్త దువ్వూరి వెంకయ్య. ఈమెకు బాల్య వివాహం జరగడం,భర్తను చిన్నతనం లోనే కోల్పోయి బాల్య వితంతువు అయ్యింది. చదువుకోలేదు. అయితే ఈమెకు తిరుపతి వెంకటశాస్త్రి బంధువు అవటం వల్ల ఆయన సుబ్బమ్మకు సాహిత్యంలో శిక్షణ ఇచ్చాడు. సుబ్బమ్మ స్వాతంత్ర్యోద్యం వైపు అడుగులు వేసి కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్ర్యా న్ని లక్ష్యంగా బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది. ఈమె కంఠం చాల గంభీరంగా ఉండడం వల్ల మైకులు లేకపోయినా ఆమె ప్రసగించే ఉపన్యాసం చాలా దూరం వినిపిం చేది. ఈమె పాడిన పాటలు  ఆంగ్లేయులకు  వినిపించకుండా డప్పులు డబ్బాలు వాయించేవారు.

■ ఈమె 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అంతే కాకుండా ఈమె ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నది. ఒక సన్నివేశంలో ఈమె ఆంగ్లేయులు ఆమెను నిర్భంధించి, క్షమాపణ చెబితే విడిచి పెడతామనప్పుడు "నా కాలి గోరు కూడా అలా చేయదు" అని నిస్సంకోచం గా చెప్పిన ధైర్యవంతురాలు.

■ ఒకసారి పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ  అనే వ్యక్తి వన భోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసిందని అందులో సుబమ్మ పాల్గొటుంటున్నట్లు ఆంగ్లేయ పోలీసులు తెలుసుకొని అక్కడ దాడి చేశారు. దీనికి సుబమ్మ గారు ఆగ్రహించి వారిపై విరుచుకుపడింది, ఆమె ధైర్యానికి చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకొని మిగతా వారు కూడా బ్రిటిష్ రక్షక దళాలపై విరుచు పడ్డారు.

■ సుబ్బమ్మ మహాత్మా గాంధీ గారి ఆదేశాలపై ఖద్దరు కట్టింది, ఖద్దరు చరఖా మీద నేసి ఊరూరా తిరిగి అమ్మింది. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పింది, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. రాజమండ్రిలో సనాతన స్త్రీవిద్యాలయమనే బాలికల పాఠశాలను  స్థాపించింది.

■ ఈమె 16 సంవత్సరాల పాటు ఏ.ఐ.సి.సి. సభ్యురాలిగా ఉన్నారు. కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రేసు సభలో వీరికి 'దేశ బాంధవి' అనే గౌరవం ఇచ్చారు.

■ జవహర్ లాల్ నెహ్రూ  మరణానంతరం, 1964 సంవత్సరం మే 31 తేదీన ఈమె పరమపదించింది.

(జ: 1880 - మ: 31 మే, 1964)

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...