🌷🌷🙋 🍥ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్ట మొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతు న్నది. *🌷తొలినాటి జీవితం..👩🏻* 🍥ఆనందీబాయి పూణే(మహారా ష్ట్ర)లోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.ఈమెకు తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత, ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, కళ్యాణ్ లో తపాలా గుమాస్తాగా పనిచేసేవారు. తరువాత, అతను అలీభాగ్, చివరకు కలకత్తా బదిలీ అయ్యారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికారు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. 🍥ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది. *🌷భర్త సహకారంతో వైద్యవృత్తి దిక్కుగా..👫* 🍥గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. అనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు సాగించాడు. 1880లో, అతను రాయల్ విల్డర్ (ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ) కు వ్రాసిన లేఖలో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్‌లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ, తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికై విచారించారు. ఇద్దరు ఆలుమగలు క్రైస్తవ మతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించా డు. అయితే ఈ ప్రతిపాదన జోషి జంటకు ఆమోదయోగ్యం కాలేదు. *🍥అయితే విల్డర్ ఈ ఉత్తరప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్ స్టన్ మిషనరీ రివ్యూలో ప్రచురించాడు. రొస్సెల్, న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురుచూస్తూ ఆయన కార్యాలయం లో యాధృఛ్ఛికంగా ఈ పత్రికలో ఆనందీబాయి గురించి చదివింది. వైద్యవిద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త యొక్క వృత్తాంతం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం వ్రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకువచ్చింది. కార్పెంటర్‌కు, ఆనందీబాయికి మధ్య అనేక విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. వారు పరస్పరం సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలలో బాల్యవివాహం కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒకటి కావటం విశేషం.* 🍥" సెరంపోర్ కాలేజ్" హాలులో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో వెల్లడించింది. భారతదేశంలో హిందూ మహిళావైద్యురాళ్ల అవసరం గురించి వివరించింది. అలాగే ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని వివరించింది. అయితే తాను క్రైస్తవమతాన్ని స్వీకరించనని మాత్రం వత్తిపలికింది. ఆమె ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. *🍥 భారతదేశం నలుమూలల నుండి ఆర్థికసహాయం చేస్తామని సందేశాలు అందుకున్నది. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్త్రాయి కూడా 200 రుపాయల ఆర్థికసాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా అనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది. ప్రజలు ఆమె మీద రాళ్ళు, కాకి రెట్ట విసరడం వ్యతిరేకతలో పతాకాంశమని చెప్పాచ్చు.* *🌷అమెరికాలో..ఆనందీబాయి👩🏻⚕* 🍥ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఇద్దరు ఆంగ్ల మహిళలు ఉన్నారు. 1883 జూన్లో న్యూయార్క్‌లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆమె ఇంటికి చేరింది. న్యూయార్క్ లో 1983లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి బస మరియు పోషణ బాధ్యత వహించింది. ఆనందీ మరియు కార్పెంటర్ అత్యంత ఆత్మీయులుగా మారారు. కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించి అభిమానించింది. ఆనందిని చూసి కార్పెంటర్ విస్మయం చెందగా, అమెరికా వైవిధ్యం ఆనందిగోపాలు ను విస్మయపరిచాయి. *🌷అమెరికావాసం-ఆరోగ్య స మస్య🙇🏻♀* 🍥ఆమె అమెరికాలో ఎదుర్కొన్న ప్రధానసమస్య శీతోష్ణస్థితి. అయినా ఆమెకు కాలేజి వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన " ఫైర్ ప్లేస్ " లేనందున ఫైర్ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడం వలన ఆమెకు చలి కాని లేక పొగ కాని భరించవలసిన పరిస్థితి ఎదురైంది. రెండు సంవత్సరాల అమెరికా వాసం తరువాత ఆమెకు అపస్మారకం మరియు తీవ్రజ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు. *🌷వైద్యంలో పట్టబద్రత..🎓* 🍥ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం 'పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల’లో పూర్తిచేసి ఫైనల్ ఎగ్జామ్ వ్రాసి,మార్చి11, 1886 న ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ సాధించింది. ఈమెతో పాటు సహాధ్యాయినులైన కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ . *🍥ఆనందీబాయి జోషి పరిశోధనాంశం "ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్యం". స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపింది. ఆమె పట్టభద్రోత్స వంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను 'మొట్టమొదటి భారతీయ వైద్యురా లుగా 'పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేదిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో 'పండిత రమాబాయి' పాల్గొనడం మరో ప్రత్యేకత.* 🍥ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. అయినా వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరిం చింది. కొల్హాపూరు సంస్థానంలో వైద్యురాలిగా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. *🌷తిరిగి భారతదేశానికి- ఆనం దీబాయి..🚶🏻♀* 🍥భారతదేశానికి తిరుగుప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకాలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. కారణం ఆమె " బ్రౌన్ వుమన్ " (సాధారణంగా భారతీయుల ను బ్రౌన్ ప్రజలు అంటారు) కావడమే. 1886 చివరిభాగంలో, ఆనందిబాయి భారతదేశానికి తిరిగివచ్చారు. దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. *🍥ఆమెను కొల్హాపూర్ సంస్థానా నికి చెందిన వైద్యురాలిగా నియమించింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలను అప్పగించింది.* *🌷మరణం..🛏* 🍥కలకత్తా చేరిన తరువాత ఆనందీభాయి బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం మరియు ఆయాసాలతో బాధపడింది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు కజిన్ ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్సచేయడానికి నిరాకరించాడు. భారతదేశానికి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరం లోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిరుప్రాయంలో అకాల మరణం చెందారు. 🍥ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్ కు పంపబడింది. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ శ్మశాన వాటికలో బధ్రపరచింది. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశానవాటికలో ఇప్పటికీ చూడవచ్చు. *🌷ఆత్మకథ..👩🏻* 🍥అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను వ్రాసింది.దూరదర్శన్ ఆనందీబాయి జీవితమును ఆధారముగా చేసుకొని తీసిన ధారావాహిక "ఆనందీ గోపాల్"ను ప్రసారం చేసింది. *🌷స్త్రీవాదం..🙋* *🍥ఆనందీభాయికి తన 15వ సంవత్సరంలో ఇలాంటి అభ్యుదయభావాలు ఎలా అలవడినాయి అన్న విషయం ఆమె మిసెస్ కార్పెంటరుకు వ్రాసిన ఉత్తరాలు వెలువరిం చాయి. ఆ రోజులలో ఆమె వెలువరచిన అభిప్రాయాలు ఇప్పటికీ స్త్రీవాదులచేత పరిశీలించబడుతున్నాయి. స్త్రీవాద రచయితలైన తారాబాయి వ్రాసిన " స్త్రీ పురుష తులన ", పండిత రమాబాయి వ్రాసిన " స్త్రీ ధర్మ నీతి" మరియు రఖ్మబాయి వ్రాసిన " ది హిందూ లేడీ " వంటి పుస్తకాలలో ఆనందీబాయి వృత్తాంతం ప్రస్తావించబడినది. ఆనందీబాయి 15 సంవత్సరాల ప్రాయంలో ఆమె ఆలోచనాసరళిలో ఇలాంటి మార్పులు రావడం పలువురిని విస్మయపరచింది.* 🍥ఆనందీబాయి ప్రయత్నాలు నిష్ఫలం కాలేదు. ప్రస్థుతం ఆధునిక స్త్రీ అభ్యుదయ ప్రయాణం లో ఆనందీబాయి భావాలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్తితులు ఎదురైనప్ప టికీ ఎవరి స్వప్నాలు సాధించలేనివి కాకూడ దు. ప్రతి ఒక్కరు వారి కలలను నిజంచేసుకు నే శక్తివంతులు కావాలి అన్న ఆనందీబాయి ఆశయాలు ఇప్పటికీ గౌరవించబడుతున్నా యి. 🍥అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- గతంతో పోలిస్తే ఇవ్వాళ ఎంతో మంది మహిళా డాక్టర్లున్నారు. ఇక నర్సింగ్ రంగంలో దాదాపు అందరూ మహిళలే. *🍥అయినప్పటికీ ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో 2011లో ‘‘హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హెల్త్ ఇన్ ఇండియా’’ శీర్షికతో ప్రచురితమైన కథనం ప్రకారం... వైద్యరంగంలో మహిళల భూమిక ఇంకా 17 శాతం మాత్రమే. అంటే ఆకాశంలో సగమైన మహిళ వైద్యరంగంలో ఇంకెంతో పురోగమించాల్సిన అవసరం ఉంది..* (మార్చి31,1865 -ఫిబ్రవరి 26,1887)
తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...
Comments
Post a Comment